twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చౌకీదార్ చేతికర్ర అంటే భయమా? వివేక్ ఒబేరాయ్ సెటైర్లు

    |

    ప్రధాని నరేంద్రమోదీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన పీఎం నరేంద్రమోదీ‌లో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ ప్రధాని మోదీగా నటించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నందున్న ఓటర్లను ప్రభావితం చేస్తుందనే కారణంతో సినిమా రిలీజ్‌ను వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై వివేక్ ఒబేరాయ్ సెటైర్లు వదిలారు.

    చౌకీదార్ (ప్రధాని మోదీ) చేతిలో కర్రను చూసి భయపడుతున్నారా? అని కాంగ్రెస్‌ పార్టీని ఎగతాలి చేస్తూ వివేక్ ఒబేరాయ్ కామెంట్లు చేశారు. ప్రతిపక్షం ఎందుకు భయపడుతున్నది. వారి భయం వెనుక కారణం ఏమిటి? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

    కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిల్‌ను ముంబై కోర్టు తిరస్కరించడంపై వివేక్ కామెంట్ చేస్తూ అభిషేక్ మను సింఘ్వీ లాంటి ఉత్తమ లాయర్ల సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు అని అన్నారు.

    Vivek Oberoi satires on Congress over PM Narendra Modi movie

    పీఎం నరేంద్రమోదీ సినిమా రిలీజ్‌ను వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల స్పందిస్తూ.. ఈ బయోపిక్ రిలీజ్‌ను తాము వాయిదా వేసే హక్కు లేదు. సెన్సార్ బోర్డు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. త్వరలోనే వారు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారు అని ఈసీ అధికారులు వెల్లడించారు.

    ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న పీఎం నరేంద్రమోదీ చిత్రంలో సురేష్ ఒబెరాయ్, బర్ఖా సేన్‌గుప్తా, ప్రశాంత్ నారాయణ్, దర్శన్ కుమార్, బోమన్ ఇరానీ, జరీనా వహెబ్, తదితరులు నటించారు.

    English summary
    PM Narendra Modi caught in the web of controversies for various reasons. After the release of the trailer, the movie was called propaganda by many. The film is scheduled to release on April 5, 2019, and a PIL was filed to stay the release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X