1200 కోట్ల సంపద, ఫారిన్‌లోనూ ఆస్తులు .. బిగ్ స్టార్స్‌కే షాకిస్తోన్న రక్తచరిత్ర నటుడు
ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యునరేషన్ లేదా అత్యధికంగా ఆస్తులు ఉన్న నటీనటుల లిస్ట్ లాంటిది తీస్తే డెఫినెట్ గా అందులో చాలా మంది బిగ్ స్టార్స్ లేదా హీరోయిన్స్ ఖచ్చితంగా ఉంటారు. అలాగే అత్యధికంగా ట్యాక్స్ కట్టే సినీ తారల లిస్ట్ తీసినా అందులో స్టార్ హీరోస్ పేర్లే కనిపిస్తాయి.
కాగా ఇటీవలే ఇండియన్ సినిమా దగ్గర భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో అంటూ మన తెలుగు స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు వినిపించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ఏకంగా 300 కోట్ల రెమ్యునరేషన్ ని పాన్ ఇండియా అవైటెడ్ సీక్వెల్ చిత్రం పుష్ప 2 కి తీసుకున్నాడు అని నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి.

ఇక వీటి తర్వాత బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఏకంగా రూ.97 కోట్లు ట్యాక్స్ కడుతున్నాడు అని కూడా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే హిందీలో ఇంకో బిగ్ స్టార్ ఆనిమల్ హీరో రణబీర్ కపూర్ లాంటి స్టార్స్ ని మించి ఒక సాధారణ నటుడు , విలన్ రోల్స్ చేసే వివేక్ ఒబెరాయ్ ఇపుడు వార్తల్లోకి ఎక్కాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రణబీర్ కపూర్ కంటే ఈ నటుడు ఇండియాలో పెద్ద స్టారేమి కాదు ఇది అందరికీ తెలుసు.
అయినప్పటికీ ఆ స్టార్స్ ఈ నటుడి విషయంలో దరిదాపుల్లో కూడా లేరట. వివేక్ ఒబెరాయ్ ఆస్తులు ఒకటి రెండు కాదు ఏకంగా రూ.1200 కోట్లకి పైమాటే అట. తెలుగులో "రక్త చరిత్ర" సినిమాతో సెన్సేషన్ సెట్ చేసిన ఈ నటుడు హిందీ సహా పలు భాషల్లో నటించి అలరించాడు. హిందీలో సూపర్ హీరో మూవీ క్రిష్ 3 లో విలన్ గా, తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో వినయ విధేయ రామ లో విలన్ గా, కోలీవుడ్ లో వివేగం ఇలా చాలా భారీ సినిమాల్లో వివేక్ ఒబెరాయ్ భాగమయ్యారు.

మరి అలాంటి సినిమాల్లో నటించిన హీరోలకే ఈ రేంజ్ నెట్ వర్త్ లేదు . కానీ ఇతనికి ఇంత ఆస్తి ఎలా వచ్చిందంటే.. వివేక్ తనకి సినిమాలపై ఆసక్తితో నటిస్తున్నాడు . అంతే కానీ సినిమాలు ఒక్కటే తన జీవనాధారం కాదు. ఈ స్టార్ విలన్ కి మన దేశంలోనే కాకుండా అరబ్ దేశాల్లోనూ మంచి నెట్‌వర్క్ ఉందట. ఇంకా తనకి రియల్ ఎస్టేట్ రంగంలో బాగా అవగాహన ఉండటంతో పలు పెట్టుబడులు తనని ఈ రేంజ్ ఆస్తిపరుడుగా మార్చాయట. దీనితో ఈ నటుడు మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్ స్టార్స్ కి మించి ఆస్తుల విషయంలో టాప్ లో ఉన్నాడని చెప్పాలి.


Click it and Unblock the Notifications











