60 ఏళ్ళ వయసులో పవిత్ర లోకేష్ తో లిప్ లాక్ సీన్.. నరేష్ షాకింగ్ రియాక్షన్!
నరేష్, పవిత్రా లోకేశ్ వీరిద్దరి గురించి జరుగుతున్నంత చర్చ ఇతర ఏ సెలబ్రిటీ కపుల్స్ గురించి జరగలేదంటే అతిశయోక్తి కాదు. వీళ్లిద్దరు రిలేషన్‌షిప్ లో ఉన్నామని ప్రకటించిన నాటి నుండి సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా నరేష్, పవిత్రల గురించి రోజూ చూపిస్తూనే ఉంటున్నాయి. మళ్లీ పెళ్లి సినిమా ప్రకటించడంతో హాట్ టాపిక్ గా మారిపోయింది. నిజ జీవిత ఘటనల ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే లిప్ లీక్ 60 ఏళ్ళ వయసులో అవసరమా అనే ప్రశ్నలకు నరేష్ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..
తీవ్ర స్థాయిలో అభ్యంతరం :
పవిత్ర నరేష్ గురించి గత ఏడాది నుంచి అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. వారిద్దరు ప్రేమలో ఉన్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని అనేక రకాల కథనాలు వచ్చాయి. ఇక నరేష్ భార్య కూడా ఆ విషయంలో తీవ్ర స్థాయిలో అభ్యంతరం తెలియజేశారు. అలాగే అస్తికి సంబంధించిన వ్యవహారం కూడా వైరల్ అయ్యింది.

చాలా ఇబ్బందికర ప్రశ్నలు వేసినా:
ఇక ఈ నెల 26వ తేదీన మళ్లీ పెళ్లి సినిమా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో నరేష్, పవిత్ర లు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా ఓ ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ వీళ్లిద్దరిని ఇంటర్వ్యూ చేసింది. అందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆ యాంకర్ చాలా ఇబ్బందికర ప్రశ్నలు వేసినా నరేష్ మాత్రం చాలా కూల్ గా సమాధానాలు ఇచ్చాడు.

లిప్ లాక్ అవసరమా?:
అభ్యంతరకరంగా ఉన్న ప్రశ్నలకు కూడా నరేష్, పవిత్రలు సహనం కోల్పోకుండా జవాబివ్వడం ఆకట్టుకుంది. అయితే ఆ ఇంటర్వ్యూలో 60 ఏళ్ల వయస్సులో లిప్ లాక్ అవసరమా అని ఆ యాంకర్ అడిగితే దానికి నరేష్ ఏమాత్రం తడుముకోకుండా లిప్ లాక్ అనేది ఓ ఎమోషన్ అని సమాధానం ఇచ్చాడు నరేష్.

వాళ్ళు మాత్రమే లిప్ లాక్ చేసుకోవాలా?:
20 ఏళ్ల వారు మాత్రమే లిప్ లాక్ చేసుకోవాలా, 60 ఏళ్ల వారు చేసుకోవద్దా అని తిరిగి ప్రశ్నించారు. పెళ్లికి ముందే ఓ ప్రాపర్టీ రాయించేసుకోండి అని పవిత్రకు ఉచిత సలహా ఇవ్వగా.. దానిక్కూడా నరేష్ రివర్స్ పంచ్ వేశాడు. నేనో ఓ పెద్ద ప్రాపర్టీ అని నన్ను రాయించేసుకుందని చెప్పుకొచ్చాడు.

రియల్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని..:
నరేష్ ప్లేసులో మరొకరు, పవిత్ర ప్లేసులో ఇంకొకరు రారని గ్యారెంటీ ఉందా అని ప్రశ్నించగా.. నరేష్ నన్ను తప్ప ఇంకెవరినీ చూడరని, చూడలేరని పవిత్ర సమాధానమిచ్చింది. రియల్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని, మమ్మల్ని పిలుస్తారా అని అడగ్గా.. కచ్చితంగా మీరందరూ పెళ్లికి రావాలని, దగ్గరుండి చేయాలని ఆహ్వానించాడు నరేష్. ఇద్దరి గత జీవితాల నుండి ఏది వచ్చినా పట్టించుకోమని, తన జీవితంలో హ్యాపీగా ఉండాలనుకుంటున్నామని తేల్చి చెప్పారు నరేష్, పవిత్ర.


Click it and Unblock the Notifications











