Malli Pelli: పవిత్ర లోకేష్ మీ ఆస్తి చూసి పడిపోయిందా.. ఆ ప్రశ్నకు నరేష్ షాకింగ్ ఆన్సర్
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ ఇటీవల మళ్లీ పెళ్లి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన తన జీవితంలో జరిగిన కథనే ఇలా సినిమా ద్వారా చూపించడం విశేషం. తన పాత్రలో తానే పోషించగా, పవిత్ర క్యారెక్టర్ లో పవిత్రే నటించారు. తమ మధ్య జరిగిన పరిచయం, వారిద్దరూ కలిసి ఎందుకు జీవించాలి అనుకున్నారు అనే కోణంలో ఈ సినిమాని తీశారు. అయితే పవిత్ర లోకేష్ నరేష్ ను ఇష్టపడడానికి కారణం ఏమిటి అనే సందేహం చాలా మందికి వచ్చింది. ఇక అదే ప్రశ్న నరేష్ కు ఎదురైంది. ఇక ఆయన ఆ ప్రశ్నకు ఎలాంటి ఆన్సర్ ఇచ్చారు అనే వివరాల్లోకి వెళితే..
హఠాత్తుగా జరిగిన గొడవలతో సినిమా: పవిత్ర లోకేష్ నరేష్ ప్రేమలో ఉన్నట్లు చాలా కాలంగా అనేక రకాల రూమర్స్ వచ్చాయి. కానీ ఆ విషయంలో వారు ఇద్దరు కూడా ప్రైవసీ మెయింటైన్ చేస్తూ వచ్చారు. హఠాత్తుగా జరిగిన గొడవలను సినిమాగా రూపొందిస్తూన్నట్లు సడన్ షాక్ ఇచ్చారు. సీనియర్ నిర్మాత ఎమ్ఎస్.రాజు దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించారు. లాభాలు గట్టిగానే వస్తాయని ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు. కానీ ఊహించని చేదు అనుభవం ఎదురైంది.

విలన్ గా చూపించాలనే ఉద్దేశంతో ...: అంతేకాకుండా, తన మూడో భార్య రమ్య రఘుపతిని విలన్ గా చూపించాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశారనే ప్రచారం కూడా జరిగింది. ఈ మూవీ కోసం నరేష్ ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. ఈ క్రమంలో ఓయాంకర్ ఆయనను ఆసక్తికర ప్రశ్న అడగడం గమనార్హం. పవిత్ర మిమ్మల్ని చూసి ఇష్టపడ్డారా? లేక మీ ఆస్తి చూసి మీ వెంట పడ్డారా అని సూటిగా అడగడం గమనార్హం. దానికి నరేష్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

ఆస్తి లేనప్పుడు వెళ్లిపోయినవాళ్లు..: తనకు కు ఆస్తి లేనప్పుడు వెళ్లిపోయినవాళ్లు ఉన్నారని నరేష్ అన్నారు. తనకు ఆస్తి కోసం వచ్చిన తర్వాత తన కోసం వచ్చిన వాళ్లూ ఉన్నారన్నారు. అవన్నీ తన జీవితంలో చాలా చూశాను అని చెప్పారు. అయితే, తనకు ప్రేమకు, వ్యామోహానికి తేడా ఉందని ఆయన అన్నారు. తనకు పవిత్రలో నిస్వార్థమైన ప్రేమే నచ్చింది అని ఆయన చెప్పారు.

నరేష్, పవిత్రల మధ్య లిప్ లాక్ సీన్లు: ఇదిలా ఉండగా, మళ్లీ పెళ్లి ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొందరు ఈ సినిమాపై విమర్శలు కురిపిస్తున్నారు. నరేష్ ఆయన కథను ఆయన జోక్ చేసుకున్నారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం వీళ్ల కథ తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ థియేటర్లకు వెళ్తున్నారు. ఓ మోస్తారుగా సినిమా ఆడుతోంది. ఇక ఈ సినిమాలో నరేష్, పవిత్రల మధ్య లిప్ లాక్ సీన్లు కూడా ఉండటం గమనార్హం. ఈ విషయం ట్రైలర్ లోనే చూపించారు. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు. కాగా, త్వరోలనే నిజంగా నరేష్, పవిత్ర నిజజీవితంలో పెళ్లి చేసుకుంటారంటూ ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











