‘చీరెలు కట్టుకొని వచ్చారు.. హగ్ చేసుకొను’.. యాంకర్ స్రవంతి, హీరోయిన్ శివానీతో వీకే నరేష్
తెలుగు సినిమా రంగంలో హీరోయిన్లు, మహిళా నటుల డ్రెస్సింగ్ అంశం కొద్ది రోజుల క్రితం బారీ వివాదానికి దారి తీసింది. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ ఎమోషనల్‌గా మాట్లాడుతూ.. సినిమా ఫంక్షన్లలో హీరోయిన్లు ధరించే దుస్తులు అసభ్యకరంగా ఉంటున్నాయి. సామాన్లు బయటకు కనిపించేలా దుస్తులు ధరిస్తున్నారు. దాని వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి అంటూ కామెంట్ చేయడంపై పలువురు తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ శివాజీ కామెంట్స్‌ను తప్పుపట్టడం తెలిసింది. ఆ అంశం గురించి మరోసారి నటుడు వీకే నరేష్ ఆసక్తికరంగాను, వినోద భరితంగా కామెంట్స్ చేశారు.
హే భగవాన్ చిత్రం ప్రెస్ మీట్ సందర్భంగా వీకే నరేష్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ హగ్ డే సందర్భంగా ఆయన అందరికి హగ్ ఇస్తూ వెళ్తూ ఉంటే.. హీరోయిన్లు ఎదురు పడ్డారు. దాంతో ఆయన హాగ్ ఇవ్వడం ఆపేసి శివాజీ సంఘటన, వివాదం గురించి కొన్ని నర్మగర్భంగా, పరోక్షంగా మాట్లాడుతూ.. ఫన్ క్రియేట్ చేశారు. యువ యాక్టర్ సుహాస్ నటించిన ఈ సినిమా ఫంక్షన్‌లో జరిగిన సరదా సంఘటన గురించిన వివరాల్లోకి వెళితే..

వరల్డ్ హగ్ డేను పురస్కరించి వీకే నరేష్ ఫన్నీగా కొన్ని కామెంట్స్ చేశారు. యంగ్ హీరోయిన్లు శివానీ నాగారం, యాంకర్ స్రవంతి, యాంకర్ గీతా భగత్‌తో మాట్లాడుతూ పంచ్ డైలాగ్స్ పేల్చాడు. దాంతో స్టేజ్ మీద అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. నరేష్ మాట్లాడుతూ.. అమ్మా.. మిమ్మల్ని కూడా హగ్ చేసుకోవాలని వచ్చాను. కాకపోతే మీరిద్దరూ కూడా చీరలు కట్టుకొని వచ్చారు. అయితే కొన్ని సంఘటనలు, ఘటన తర్వాత స్టేజ్ మీద అందరూ చీరలే కొట్టుకొంటున్నారు. భారతీయ సంస్కృతి ప్రకారం స్త్రీకి, పురుషుడు హగ్ చేసుకోవద్దు కాబట్టి. . మీరిద్దరూ హగ్ చేసుకోండి అని అన్నారు.
స్టేజ్ మీద ఉన్న గెస్టులు, సినీ ప్రముఖులకు చైన్ హగ్ ఇవ్వాలని అనుకొన్నాను. కానీ అటుపక్క గీతా భగత్ ఉన్నారు అని వీకే నరేష్ అన్నారు. స్టేజ్ మీద మరోవైపు ఉన్న యాంకర్ గీతా భగత్ ఉద్దేశించి.. నీకు కూడా హగ్ ఇద్దామని అనుకొన్నాను. కానీ మీరు కూడా భారతీయ సంస్కృతి ఉట్టి పడేలా డ్రస్ వేసుకొన్నారు. మీ కట్టుబొట్టు కూడా భారతీయ సంస్కృతి కేటగిరిలోకి వస్తుంది. అలానే పరిగణిస్తాం కాబట్టి.. మీకు హ్యాపీ హగ్ డే అని దూరం నుంచే చెబుతున్నాను అని అన్నారు.
హే భగవాన్ ఈవెంట్‌ను రేపు పెడితే బాగుండని అన్నారు. ఈ రోజు హగ్ డే, రేపు కిస్ డే. ఈ రోజు పెట్టడం మంచిదైంది. ఏదైనా మన సంస్కృతి, సంస్కారం ప్రకారం ఈ సభను మొదలుపెట్టాలి. కాబట్టి ఎవరికి వారు హగ్ డే చెప్పుకొంటూ ఈవెంట్‌ను మొదలుపెడుదాం అని వీకే నరేష్ చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి సరదాగా ఈవెంట్‌ను పాజిటివ్‌గా మొదలు పెట్టడంలో నరేష్ తన టాలెంట్‌ను చూపించి అందర్నీ ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు.
ఇక హే భగవాన్ సినిమా విషయానికి వస్తే.. సుహాస్, శివానీ నాగారం, వీకే నరేష్, యాంకర్ స్రవంతి నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 20వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ద్వారా యాంకర్ స్రవంతి చొక్కారపు నటిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు గోపి అచ్చర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను బన్నీ వాసు, వంశీ నందిపాటి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు బీ నరేంద్ర రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా వేడుక ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా వీకే నరేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











