కన్నీరు మున్నీరైన నటుడు నరేష్.. తల్లి విజయ నిర్మల మరణంతో విషాదంలోకి..
నటి, దర్శకురాలు, నిర్మాత విజయ నిర్మల మరణంతో తన కుమారుడు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. తన తల్లి ఇక లేరన్న వార్తతో నటుడు వీకే నరేష్ కన్నీరు మున్నీరయ్యాడు. తీవ్ర విషాదంలో మునిగిన నరేష్‌ను సినీ ప్రముఖులు ఓదారుస్తున్నారు. తన తల్లి మృతి గురించి వీకే నరేష్ ట్వీట్టర్‌లో సమాచారం అందించారు. నరేష్ ట్వీట్ చేసినదేమిటంటే..
నా తల్లి విజయ నిర్మల గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లారని తెలియ జేయడానికి చింతిస్తున్నాను. ప్రముఖ నటి, నిర్మాత, దర్శకురాలు డాక్టర్ జీ విజయ నిర్మల గారు జూన్ 27 తేదీ తెల్లవారు జామున హైదరాబాద్‌లోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో మరణించారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె వయసు 75 సంవత్సరాలు అని వీకే నరేష్ తన తల్లి మరణం గురించి ట్వీట్ చేశారు.

నా తల్లి భౌతిక కాయాన్ని నానక్‌రామ్ గూడలోని మా నివాసంలో ప్రజలు, అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం పెడుతున్నాం. 11 గంటలకు పార్ధీవ దేహాన్ని ఇంటికి తరలిస్తాం. విజయ నిర్మల గారి అంత్యక్రియలు జూన్ 28న నిర్వహిస్తాం. నా తల్లి మరణానికి సంబంధించి మరింత సమాచారం త్వరలోనే అందజేస్తాం అని నరేష్ మరో ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











