Naresh: బెడ్ రూమ్, బాత్రూమ్ లో దూరినట్లు.. మాకు ఆధారాలు దొరికాయి.. సినీ విమర్శకులపై నరేష్ ఫైర్

మళ్లీ తెరపైకి సీనియర్ నటుడు వీకే నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ టాపిక్ వచ్చింది. గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో వీళ్లిద్దరికి సంబంధించిన అనేక వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో మరింత హైలెట్ చేస్తూ వార్తలు గింగిరాలు తిరుగుతున్నాయి. ఇంతకుముందు నరేష్ తన మూడో భార్య రమ్య రఘుపతి విషయంతో వార్తల్లో నిలవగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రతో లివింగ్ రిలేషన్ షిప్, పెళ్లి వంటి విషయాలతో తెరపైకి వచ్చారు. తాజాగా సినీ విమర్శకులు, సోషల్ మీడియా, అందులో వచ్చే ట్రోలింగ్ పై సీరియస్ గా స్పందించారు నటుడు వీకే నరేష్.

త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు..

త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు..

ఇటీవల సినీ హీరోల కంటే మోస్ట్ పాపులర్ గా మారింది సీనియర్ నటుడు నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేష్ రిలేషన్ షిప్. నరేష్, పవిత్రా లోకేష్ వీరిద్దరూ లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోనున్నారని, అందుకోసం పలు ఆలయాలు కూడా చుట్టి వస్తున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నరేష్-పవిత్ర లోకేష్ డేటింగ్ పై అనేక వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా వాళ్లిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు.

తప్పుడు వార్తలు ప్రచారం..

తప్పుడు వార్తలు ప్రచారం..

న్యూ ఇయర్.. న్యూ బిగినింగ్స్.. మీ అందరి ఆశీర్వాదం కావాలంటూ ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు నటుడు నరేష్. ఆ వీడియోలో నరేష్, పవిత్ర లోకేష్ ఇద్దరు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకోవడమే కాకుండా రొమాంటిక్ గా ఇద్దరూ లిప్ కిస్ పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఈ వీడియో కంటే ముందు నరేష్-పవిత్ర రిలేషన్ పై తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారని పలు వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానెళ్లపై పవిత్ర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు. ఆ తర్వాత నరేష్ కూడా కంప్లయింట్ చేశారు.

15 యూట్యూబ్ ఛానెళ్స్, వెబ్ సైట్స్..

15 యూట్యూబ్ ఛానెళ్స్, వెబ్ సైట్స్..

నరేష్, పవిత్ర ఫిర్యాదుతో పోలీసులు కేసు విచారణ చేసి 15 యూట్యూబ్ ఛానెల్స్, వెబ్ సైట్స్ కు నోటీసులు కూడా పంపించారు. ఇప్పుడు వాళ్లు పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన ఆ ట్రోలింగ్ ఆగట్లేదని నరేష్ ఫైర్ అయ్యారు. యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్ సైట్స్ పై ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ ఎంతవరకు వచ్చిందో తెలుసుకునేందుకు తాజాగా సీసీఎస్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు నరేష్. సీఐతో చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

పర్సనల్ వ్యవహారాలు..

పర్సనల్ వ్యవహారాలు..

కొన్ని ఛానెల్స్ మీడియాకు, సినీ పరిశ్రమకు చెడ్డపేరు తీసుకొస్తున్నాయని.. ఊరు పేరూ లేని ఛానెళ్ల వల్ల మీడియాకు, సినీ పరిశ్రమకు మధ్య దూరం పెరిగిపోయిందని నరేష్ తెలిపారు. తన సమస్యలతో సతమతం అవుతుంటే తన పర్సనల్ లైఫ్ పై చర్చలు ఎలా పెడతారని అన్నారు. "ఒక వ్యక్తి లేకుండా ఆ వ్యక్తి గురించి.. అతడి బెడ్ రూమ్ లో, బాత్రూమ్ లో దాక్కున్నట్లు.. మొత్తం అతని పర్సనల్ వ్యవహారాలు మాట్లాడుతున్నారు. దానిపై డబ్బు చేసుకుంటున్నారు" అని నరేష్ తెలిపారు.

ఎవరి జీవితం వాళ్లది..

ఎవరి జీవితం వాళ్లది..

నరేష్ ఇంకా కొనసాగిస్తూ.. "వీళ్లలో మూడు రకాల మనుషులు ఉన్నారు. ఒకరు సామాజిక కార్యకర్త అనే పేరుతో మాట్లాడుతున్నారు. మరొకరు సినీ విమర్శకుడి పేరుతో మాట్లాడుతున్నారు. సినీ విమర్శకులు సినిమా గురించి మాట్లాడాలి. సినీ నటుల వ్యక్తిగత జీవితాలతో మీకు సంబంధం ఏంటీ. ఎవరి జీవితం వాళ్లది. సామాజిక కార్యకర్తలకు సామాజిక సమస్యలు చాలా ఉన్నాయి. తిండిలేకుండా చాలా మంది ఉన్నారు. దాని గురించి మాట్లాడాలి" అని అన్నారు.

పరువు నష్టం దావా కేసు..

పరువు నష్టం దావా కేసు..

"మ్యారేజ్ కౌన్సిలర్సు కూడా మా గురించి మాట్లాడుతున్నారు. ఎవరో ఒకరు ఇండస్ట్రీ నుంచి ఫైట్ చేయాలి. అందుకే నేను దిగాను. ఈ మధ్య కొన్ని డిస్టర్బింగ్ కాల్స్ వస్తున్నాయి. నాకు కాదు. ఓవరాల్ గా సినీ పరిశ్రమలో కొన్ని డిస్టర్బింగ్ కాల్స్ వస్తున్నాయి. వీటన్నింటి మీద నేను ఫైట్ చేస్తున్నాను. ఇప్పటికే సైబర్ క్రైమ్ స్టేషన్ లో పరువు నష్టం దావా కింద కేసు వేశాను. మాకు ఆధారాలన్నీ స్ట్రాంగ్ గా దొరికాయి. అవన్నీ పోలీసులకు ఇచ్చాం. సదరు వ్యక్తులు సమాధానం చెప్పాలి" అని నరేష్ పేర్కొన్నారు.

చాలా బాధకరమైన విషయం..

చాలా బాధకరమైన విషయం..

"సినిమా ఇండస్ట్రీలో అందరూ కష్టపడి పైకి వస్తారు. ప్రతి మనిషికి ఒక పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. ఈ జీవితం మా ఇష్టం. చట్ట ప్రకారం మేం ఉంటాం. చట్ట ప్రకారం ఏం జరగినా అవి మా వ్యక్తిగతం. వాటి మీద ఒక జర్నలిస్టుగా మాట్లాడే రైట్స్ మీకు ఉన్నాయి. కానీ మా పరువుగు భంగం కలిగించి.. కించపరిచే విధంగా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం" అని ఆవేదనగా చెప్పుకొచ్చారు నటుడు నరేష్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X