Naresh Pavitra: దుబాయ్ లో నరేష్ పవిత్ర హనీమూన్.. వీడియోలు వైరల్.. రిస్క్ అవసరమా అంటూ!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు వీకే నరేష్. సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ, మంచి టైమింగ్ తో అదరగొడుతుంటాడు. అయితే ఆయన వ్యక్తిగత విషయాలు నేటి కాలంలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. నటుడు నరేష్ మరో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ను పెళ్లి చేసేందుకు రెడీ అయ్యారని గతకొంతకాలంగా హల్ చల్ చేస్తున్న వార్తలు. ఇక శుక్రవారం తమకు పెళ్లి అయినట్లు ఒక వీడియో విడుదల చేసి ప్రకటించారు నరేష్. అయితే ఈ పెళ్లి ఓ సినిమా ప్రమోషన్ కోసం చేసిందని కొత్త వాదన వినిపిస్తుంది. ఈ క్రమంలో నరేష్, పవిత్ర హనీమూన్ కు దుబాయ్ వెళ్లారని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.

ట్విటర్ వేదికగా..

ట్విటర్ వేదికగా..

గత కొంతకాలంగా తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు సీనియర్ నటుడు, హీరో వీకే నరేష్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్. వీళ్లిద్దరూ సహాజీవనం చేస్తున్నారని మొన్నటి వరకు పుకార్లు బీభత్సంగా షికార్లు చేయగా తాజాగా వాళ్ల పెళ్లి జరిగినట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు నరేష్. వారిని ఆశీర్వదించాల్సిందిగా ప్రార్థిస్తూ ఒక వీడియోను ట్విటర్ వేదికగా వదిలాడు. అది కాస్తా వైరల్ గా మారింది.

 ఏడు అడుగులు కలిసి..

ఏడు అడుగులు కలిసి..

ఈ వీడియోలో "ఒక పవిత్ర బంధం.. రెండు మనసులు.. మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు పవిత్రనరేష్" అని ఆ వీడియోకు క్యాప్షన్ రాసుకొచ్చాడు నరేష్. అలాగే ఇందులో పవిత్ర చేతికి కంకణం కట్టి, తలపై జీలకర్ర బెల్లం పెట్టి ఇద్దరు దండలు మార్చుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఏడు అడుగులు వేశారు. అయితే ఈ పెళ్లి నిజంగా జరిగిందా.. నరేష్ అందరిని బోల్తా కొట్టించేందుకు చేసిన ట్రిక్కా అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సినిమా ప్రమోషన్స్ లో..

నరేష్ పెళ్లి చేసుకున్నంట్లు చూపించిన వీడియోలో చుట్టు పక్కల ఉన్న వాళ్లు బంధువులుగా కనిపించడం లేదని, అదంతా ఏదో స్టూడియోలో జరిగనట్లుగా అనుమానిస్తున్నారు. నరేష్, పవిత్ర ఒక సినిమాలో జంటగా నటిస్తున్నారని, అందులో భాగంగానే ఈ వీడియో చిత్రీకరించారని టాక్. ఇక ఇటీవలే ఇంటింటి రామాయణం సినిమా ప్రమోషన్స్ లో తన పెళ్లిపై ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇస్తానని నరేష్ మాట్లాడటం తెలిసిందే.

దుబాయ్ లో షికారు..

ఇదిలా ఉంటే నరేష్, పవిత్ర పెళ్లి విషయం తెలియగానే మరో టాపిక్ చర్చకు వచ్చింది. పెళ్లి చేసుకున్న పవిత్ర, నరేష్ హనీమూన్ కు వెళ్లారని వార్తలు వచ్చాయి. కానీ శుక్రవారం నరేష్ ప్రెస్ మీట్ లో కనిపించేసరికి ఆ వార్తలకు చెక్ పడినట్లు అయింది. అయితే నరేష్, పవిత్ర దుబాయ్ లో షికారు చేసిన వీడియోలు తాజాగా బయటకు వచ్చాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలను చూసి చాలా మంది హనీమూన్ అయిపోయాందా అని ప్రశ్నిస్తున్నారు.

రిస్క్ అవసరం అంటావా..

ఈ వీడియోల్లో దుబాయ్ లోని పలు ప్రాంతాల్లో నరేష్, పవిత్ర విహరించడం చూడొచ్చు. ముఖ్యంగా గల్ఫ్ ఎడారుల్లో అలసిపోతూ ప్రకృతిని ఆస్వాదించింది ఈ జంట. అలాగే క్రూయిజ్ పార్టీలు, షాపింగ్ లు ఎంజాయ్ చేశారు. ఇసుక తిన్నెల్లో నరేష్, పవిత్ర అలసిపోతూ నడిచిన వీడియోలు చూసిన నెటిజన్లు సెటైరికల్ గా కామెంట్స్ పెడుతున్నారు. 'వయసు అయిపోయింది.. అందుకే తెగ ఆయాసపడుతున్నారు', 'ఈ వయసులో రిస్క్ అవసరం అంటావా.. అదే ఎడారిలో నడవడం' అంటూ ద్వంద అర్థాలు వచ్చేలా కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X