Malli Pelli Trailer: మూడో భార్యను తన్నిన నరేష్.. నిజ సంఘటనలతో మళ్లీ పెళ్లి!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు పొందారు వీకే నరేష్. సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ, మంచి టైమింగ్ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆయన వ్యక్తిగత విషయాలు ఎక్కువగా ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ తో రిలేషన్ షిప్ లో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెగ వార్తల వచ్చాయి. అంతేకాకుండా పవిత్రను పెళ్లి చేసుకున్న వీడియో షేర్ చేసి మరింత షాక్ ఇచ్చారు నరేష్. ఆ తర్వాత అది మళ్లీ పెళ్లి (Malli Pelli) సినిమా కోసం చేసిన స్టంట్ అని తెలిసి అంతా అవాక్కయ్యారు. అలాంటి సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్.
డిఫరెంట్ గా ప్రమోషన్స్:వీకే నరేష్ (VK Naresh), పవిత్ర లోకేష్ (Pavitra Lokesh) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మళ్లీ పెళ్లి (Malli Pelli). ఈ సినిమాను తెలుగు, కన్నడ రెండు భాషల్లో రూపొందించారు. నరేష్ తల్లి విజయ నిర్మల స్థాపించిన విజయకృష్ణ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు మొదటి నుంచే డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేస్తూ ఆశ్చర్యపరిచారు వీకే నరేష్. మొదట పవిత్ర, నరేష్ కిస్ చేసుకున్న వీడియోను విడుదల చేసి షాక్ ఇచ్చారు.

నిజ సంఘటనలతో:అనంతరం పెళ్లి వీడియోతో మరో సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇక అదంతా సినిమా ప్రమోషన్స్ లో భాగమని సోషల్ మీడియాలో కామెంట్స్ రావడంతో కొద్ది రోజులకు మళ్లీ పెళ్లి అనే టైటిల్ తో గ్లింప్స్ వదిలారు. ఇందులోని సాంగ్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నరేష్, పవిత్ర నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

మూడో భార్యగా:ప్రముఖ దర్శకనిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన మళ్లీ పెళ్లి మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ట్రైలర్ లో కూడా నరేష్, పవిత్రల పరిచయం, లైఫ్ జర్నీ, సంతోషాలు, బాధలు, ప్రేమ వంటి అంశాలను ఆవిష్కరించారు. అయితే సినిమాలో ఒరిజినల్ పేర్లు మార్చారు. నరేష్ ను నరేంద్రగా, పవిత్రను పార్వతిగా చూపించారు. నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి పాత్రలో వనితా విజయ్ కుమార్ నటించారు.

నెగెటివ్ గా:ట్రైలర్ లో వనితా విజయ్ కుమార్ (మూడో భార్య)ను నరేష్ తన్నిన సన్నివేశం చూపించి ఆశ్చర్యపరిచారు. ఆయన పెద్ద సూపర్ స్టార్. ఈయన బుల్లి సూపర్ స్టార్. మేడమ్ (విజయ నిర్మల) కొడుకు అంటూ అన్నపూర్ణతో చెప్పించిన డైలాగ్ తో సినిమాలో నిజ జీవిత సంఘటనలను ఏమాత్రం మొహమాటం లేకుండా చూపించినట్లు తెలుస్తోంది. అంతకుమించి ఇందులో నరేష్ సైడ్ మాత్రమే చూపించకుండా ఆయన్ను నెగెటివ్ గా కూడా చూపించే ప్రయత్నం చేశారు.

మే 26.. 2 భాషల్లో:ట్రైలర్ లో అక్కడక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ సైతం ఉన్నాయి. ఈ సినిమాను మే 26న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీలో జయసుధ, శరత్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే వనితా విజయ్ కుమార్, అనన్య నాగళ్ల, రోషన్, రవివర్మ, భద్రం, అన్నపూర్ణ, యుక్త ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు నటించగా.. సురేష్ బొబ్బిలి మ్యూజిక్, అరుల్ దేవ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











