Naresh Pavitra మళ్లీ పెళ్లి.. షాకింగ్ ట్విస్ట్.. నరేష్ పవిత్ర అసలు కథ ఇది!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు వీకే నరేష్. సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ, మంచి టైమింగ్ తో అదరగొడుతుంటాడు. అయితే ఆయన వ్యక్తిగత విషయాలు నేటి కాలంలో ఎక్కువగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
నరేష్ మరో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసేందుకు రెడీ అయ్యారని గతకొంతకాలంగా వార్తలు హల్ చల్ చేశాయి. అయితే ఇటీవల తమకు పెళ్లి అయినట్లుగా నరేష్ ఒక వీడియో విడుదల చేసి ఆశ్చర్యపరిచాడు. అయితే ఇప్పుడు నరేష్, పవిత్ర అసలు పెళ్లి గోల బయటపడింది.

ఆశీర్వదించాల్సిందిగా..
గత కొంతకాలంగా తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు సీనియర్ నటుడు, హీరో వీకే నరేష్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్. వీళ్లిద్దరూ సహాజీవనం చేస్తున్నారని మొన్నటి వరకు పుకార్లు బీభత్సంగా షికార్లు చేయగా ఇటీవల వాళ్ల పెళ్లి జరిగినట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు నరేష్. వారిని ఆశీర్వదించాల్సిందిగా ప్రార్థిస్తూ ఒక వీడియోను కూడా ట్విటర్ వేదికగా వదిలాడు. అది కాస్తా వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

నిజంగా జరిగిందా..
నరేష్ షేర్ చేసిన ట్వీట్ వీడియోలో "ఒక పవిత్ర బంధం.. రెండు మనసులు.. మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు పవిత్రనరేష్" అని క్యాప్షన్ రాసుకొచ్చాడు. అలాగే ఆ వీడియోలో పవిత్ర చేతికి కంకణం కట్టి, తలపై జీలకర్ర బెల్లం పెట్టి ఇద్దరు దండలు మార్చుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఏడు అడుగులు వేశారు. అయితే ఈ పెళ్లి నిజంగా జరిగిందా.. నరేష్ అందరిని బోల్తా కొట్టించేందుకు చేసిన ట్రిక్కా అని పలువురు అప్పుడే అనుమానం కూడా వ్యక్తం చేశారు.

ఇంకాస్తా ఊరిస్తూ..
నరేష్ పెళ్లి చేసుకున్నంట్లు చూపించిన వీడియోలో చుట్టు పక్కల ఉన్న వాళ్లు బంధువులుగా కనిపించడం లేదని, అదంతా ఏదో స్టూడియోలో జరిగనట్లుగా భావించారు. నరేష్, పవిత్ర ఒక సినిమాలో జంటగా నటిస్తున్నారని, అందులో భాగంగానే ఈ వీడియో చిత్రీకరించారని కూడా టాక్ నడిచింది. ఇక ఇంటింటి రామాయణం సినిమా ప్రమోషన్స్ లో తన పెళ్లిపై ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇస్తానని నరేష్ మాట్లాడి ఇంకాస్తా ఊరించారు.
అధికారిక ప్రకటన..
అయితే తాజాగా నరేష్, పవిత్ర పెళ్లికి సంబంధించిన వీడియోకు చెక్ పడింది. అదంతా ఒక సినిమా కోసమని తెలిసింది. ప్రముఖ డైరెక్టర్ ఎం ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న మళ్లీ పెళ్లి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నరేష్ అలా వీడియోలు షేర్ చేసినట్లు తెలిసి అంతా షాక్ అవుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన ఇచ్చాడు నరేష్. మళ్లీ పెళ్లి టైటిల్ గ్లింప్స్ ను తాజాగా విడుదల చేశారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
టైటిల్ పోస్టర్..
నరేష్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మళ్లీ పెళ్లి సినిమాను తెలుగు, కన్నడ రెండు భాషల్లో రూపొందిస్తున్నారు. నరేష్ తల్లి విజయ నిర్మల స్థాపించిన విజయకృష్ణ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. విజయకృష్ణ మూవీస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను ఈ వేసవిలోనే తీసుకవచ్చేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఇలా నరేష్, పవిత్ర అసలు పెళ్లి కథ ఇది అని తెలిసి నెటిజన్లు ఘోరంగా రియాక్ట్ అవుతున్నారు. చావు దెబ్బ కొట్టావ్ కదా అంకుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











