నిజాలు బయటపెడుతా.. న్యాయం కోసం పోరాటం.. మూడో భార్యకు వీకే నరేష్ ఘాటుగా కౌంటర్
ప్రముఖ నటి పవిత్రా లోకేష్‌తో పెళ్లి వార్తల నేపథ్యంలో నటుడు వీకే నరేష్‌పై ఆయన మూడో భార్య రమ్య రఘుపతి కన్నడ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర గందరగోళం నెలకొన్నది. ఓ వైపు పవిత్రా లోకేష్‌తో స్ట్రింగ్ ఆపరేషన్, మరోవైపు రమ్య వరుస మీడియా సమావేశంతో ఈ వివాదం దక్షిణాది మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదం నేపథ్యంలో కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉంటున్న నటుడు నరేష్ తొలిసారి బెంగళూరులో మీడియా ముందుకు వచ్చారు. ఆయనతో మీడియా మాట్లాడేందుకు ప్రయత్నించగా.. తిరస్కరించారు. బెంగళూరులో వీకే నరేష్ మీడియా సమావేశం గురించిన వివరాల్లోకి వెళితే..

పవిత్ర లోకేష్, వీకే నరేష్ కలిసి మెలిసి
గత కొద్ది రోజులుగా వీకే నరేష్, పవిత్రా లోకేష్ వివాహం చేసుకొన్నారనే వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. అంతేకాకుండా వారిద్దరు మహాబలేశ్వరంలోని ఓ పూజారిని సందర్శించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. భార్యాభర్తల మాదిరిగా పవిత్ర, వీకే నరేష్ కలిసి మెలిసి కనిపించడంతో పెళ్లి రూమర్లకు బలం చేకూరింది.

కృష్ణ ఫ్యామిలీ సపోర్టు ఉందని అంటూ
ఇక కర్ణాటకలో పవిత్రా లోకేష్‌తో మీడియా నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్‌లో ఆమె సంచలన విషయాలు బయటపెట్టింది. తమ అఫైర్‌కు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. మేమంత ఫామ్‌హౌస్‌లోనే కృష్ణతో కలిసి ఉంటున్నాం. మా పెళ్లి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సుచేంద్ర ప్రసాద్‌తో నాకు పెళ్లి కాలేదు. అతడు నాకు భర్త కాదు అని పవిత్రా లోకేష్ చెప్పారు.

బెంగళూరులో వీకే నరేష్
అయితే పవిత్రా లోకేష్ తనకు మోసం చేసింది. తన ఫ్యామిలీ ప్రతిష్టను మంట గలిపేందుకు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నది.వీకే నరేష్ నాపై కుట్రలు పన్నుతున్నారు అని రమ్య చేసిన ఆరోపణలకు సమాధానం ఇచ్చేందుకు వీకే నరేష్ బెంగళూరు చేరుకొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

మీడియా సమావేశం రద్దు చేసిన వీకే నరేష్
అయితే గురువారం (జూన్ 30) తేదీన వీకే నరేష్ మీడియా సమావేశం కోసం జర్నలిస్టులు ఎదురు చూశారు. అయితే అర్ధాంతరంగా మీడియా సమావేశాన్ని వాయిదా వేశారు. అయితే మీడియా ప్రతినిధులు వెంటాడుతుంటే.. కారులో వెళ్లిపోయారు. నరేష్ మీడియాను తప్పించుకొని వెళ్తుంతుండగా జర్నలిస్టులు మాట్లాడించేందుకు ప్రయత్నించారు.
Recommended Video


నిజాలు చెబుతాను..
వీకే నరేష్ కారులో వెళ్లిపోతూ. మీ అందరితో నేను మాట్లాడుతాను. నాకు వేరే కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్నాను. తప్పకుండా మీతో మాట్లాడుతాను. నేను త్వరలోనే నిజాలు చెబుతాను. నాకు న్యాయం కావాలి. మనకు న్యాయం జరగాలి అంటూ కారులో వెళ్లిపోయారు.


Click it and Unblock the Notifications











