For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మూడో భార్యతో ప్రాణహాని, అలాంటి టార్చర్.. ఆమెకు ఎవరితో రిలేషన్ ఉందో తెలుసు.. వీకే నరేష్ సంచలన వ్యాఖ్యలు

  |

  మూడో భార్య రమ్య రఘుపతి తనపై చేసిన తీవ్ర ఆరోపణలపై నటుడు వీకే నరేష్ ఘాటుగా స్పందించాడు. రమ్య చేస్తున్న అవాస్తవ ప్రచారాలను, ఆమె చేస్తున్న మోసాలను బయటపెట్టడానికి తాను బెంగళూరుకు వచ్చాను. హైదరాబాద్‌లో 2 కోట్ల రూపాయలు మోసం చేసింది. హిందూపూర్ కేంద్రంగా చేసుకొని వ్యాపారాలు చేసి సాధారణ ప్రజలను మోసగించేందుకు ప్లాన్ చేసింది. అందుకే బెంగళూరు, కర్ణాటక ప్రజలను అలెర్ట్ చేయడానికి వచ్చాను అని వీకే నరేష్ అన్నారు. ఇంకా మీడియాతో మాట్లాడుతూ...

   సాక్ష్యాలతో బెంగళూరుకు వచ్చా

  సాక్ష్యాలతో బెంగళూరుకు వచ్చా


  రమ్య చేసిన మోసాల వల్ల నేను చాలా సమస్యలను ఎదుర్కొన్నాను. పేదల నుంచి కూడా వ్యాపారం పేరుతో డబ్బులు వసూలు చేసింది. హిందూపూర్, అనంతపురం, హైదరాబాద్‌లో ఆమె మోసాలు గ్రహించారు. ఇప్పుడు బెంగళూరులో ఫ్రెష్‌గా డబ్బులు గుంజే ప్లాన్ చేసింది. ఆ కుట్రను బయటపెట్టడానికి సాక్ష్యాలతో బెంగళూరుకు వచ్చాను అని వీకే నరేష్ తెలిపారు. మాకు పెళ్లి జరిగి పదేళ్లు అయింది. 8 ఏళ్ల నుంచి వేర్వేరుగా ఉంటున్నాం. మాకు తొలి సంతానం కలిగినప్పటి నుంచి వేర్వేరుగా ఉంటున్నాం. నాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. వయోభారంతో ఉన్న నా పెద్దలను చూసుకోవాలి. నా కెరీర్‌ను చక్కదిద్దుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను వదిలేసి వెళ్లిపోయింది అని వీకే నరేష్ తెలిపారు.

   నన్ను సర్వనాశనం చేసిందంటూ

  నన్ను సర్వనాశనం చేసిందంటూ


  రమ్య నా నుంచి వేరుపడిన తర్వాత బెంగళూరు వచ్చింది. వ్యక్తిగత, వ్యాపార, ప్రొఫెషనల్ రిలేషన్స్‌తో కాలం గడుపుతున్నది. అందర్నీ చీటింగ్ చేస్తున్నది. పవిత్రా లోకేష్ గురించి అడిగారు కాబట్టి నేను ఆమెతో ఉన్న సంబంధం గురించి చెబుతాను. నేను నటుడిగా 250 చిత్రాల్లో నటించాను. 100 మంది లేడీ ఆర్టిస్టులతో పనిచేశాను. ఏ ఒక్కరు కూడా నాపై కామెంట్స్, ఆరోపణలు, ఫిర్యాదు చేయలేదు. నేను పాలిటిక్స్, సినిమా రంగంలో కొనసాగుతున్నాను. రమ్య నా లైఫ్‌లోకి వచ్చి మొత్తం సర్వనాశనం చేసింది అని వీకే నరేష్ అన్నారు.

  కృష్ణ వద్దకు వచ్చి గొడవ చేయడంతో

  కృష్ణ వద్దకు వచ్చి గొడవ చేయడంతో


  హైదరాబాద్‌లో రమ్య చేసిన అప్పులను నేను స్వయంగా కట్టాను. కృష్ణ గారి వద్దకు వచ్చి చాలా మంది గొడవ చేశారు. ఆమె జైలుకు వెళ్తానని అంటే.. 10 లక్షలు స్వయంగా ఇచ్చాను. ఇప్పుడు నాపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నది. నేను మగాడ్ని. నాకు ఓ అవసరాలు ఉంటాయి. నాకు ఎమోషనల్ సపోర్ట్ కావాల్సిన సమయంలో నాకు పవిత్ర లోకేష్ పరిచయం అయింది. నా కష్టాలను అర్ధం చేసుకొన్నది. నాతోపాటు ట్రావెల్ అయింది. నా ఫ్యామిలీతో కలిసి ఉంటున్నది. నా జీవితంలో నీవు ఎక్కడ ఉన్నావు అని వీకే నరేష్ ప్రశ్నించాడు.

   ఎవరితో ఉన్నావో నాకు తెలుసు

  ఎవరితో ఉన్నావో నాకు తెలుసు


  నా ఫ్యామిలీ ఫంక్షన్లకు దూరంగా ఉన్నావు. నీవు ఎక్కడో.. ఎవరితోనో ఉంటున్నావు. ఆ విషయాల గురించి నేను మాట్లాడను. నీవు నీకు సంబంధించిన రిలేషన్స్‌తో, పర్సనల్, ప్రొఫెషనల్ వ్యాపకాలతో బిజీగా ఉన్నావు. వాటి గురించి చెడుగా మాట్లాడను. పవిత్రా లోకేష్ మూడు నాలుగేళ్ల క్రితం నా జీవితంలోకి వచ్చింది. కానీ నీవు 8 ఏళ్ల క్రితం వెళ్లిపోయావు. కానీ నా ప్రతిష్టకు భంగం కలిగించేలా.. నాపై చెడుగా ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నది. ఆమె కుటుంబ సభ్యులే డబ్బు ఇవ్వవద్దని హెచ్చరించారు అని వీకే నరేష్ చెప్పారు.

  రమ్య మానసిక పరిస్థితి బాగాలేదు

  రమ్య మానసిక పరిస్థితి బాగాలేదు


  రమ్య మానసిక పరిస్థితి బాగా లేదు. ఆమెను మంచి సైక్రియాటిస్టుకు చూపించమని చెప్పారు. ఆమె మాట్లాడుతున్న చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. నన్ను బ్లాక్‌మెయిల్ చేసి నా నుంచి డబ్బు గుంజాలని చూస్తున్నారు. నాకు టార్చర్ పెడుతున్నారు. ఆమె మానసిక వ్యాధితో బాధపడుతున్నది. డబ్బు సంపాదించాలి. మోసం చేయాలనే ప్రయత్నిస్తున్నది.జర్నలిజం చదువుకొని ఏదో కంపెనీలు పెట్టింది. ఎమ్మెల్యే కావాలనే కోరికతో డబ్బు సంపాదించే పనిలో ఉంది. ఆమె వల్ల, ఆమె ఫ్యామిలీ వల్ల నా ప్రాణాలకు ముప్పు ఉంది. అందుకే నేను డైవోర్స్ కోసం అప్లై చేశాను. పవిత్ర లోకేష్ కోసం నేను రమ్యకు డైవోర్స్ ఇవ్వడం లేదు అని వీకే నరేష్ అన్నారు.

   లీగల్ నోటీసులు ఇచ్చా

  లీగల్ నోటీసులు ఇచ్చా

  రమ్య చేసిన అప్పుల వల్ల నేను భయపడిపోయాను. ఆమెతో సంబంధం లేదని లీగల్ నోటీసులు ఇచ్చాను. నా పాస్‌పోర్ట్ నుంచి ఆమె పేరును తొలగించాను. ఇప్పుడు పవిత్రా లోకేష్‌ను పెళ్లి చేసుకొంటానా? లేక సహజీవనం చేస్తానా అనేది భవిష్యత్‌లో తెలుస్తుంది.ఏది జరిగినా నేను అధికారికంగా మీడియాకు వెళ్లడిస్తాను అని వీకే నరేష్ అన్నారు.

  English summary
  Actor VK Naresh made sensational comments on Third wife Ramya Raghupathi, Naresh says He had life threat from third wife Ramya Raghupathi amid marriage news with Pavithra lokesh
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X