Malli Pelli: నరేష్, పవిత్రకు రమ్య షాక్.. సినిమా విడుదల ఆగిపోతుందా?
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో బాగా హాట్ టాపిక్‌గా మారిపోయిన చిత్రాల్లో 'మళ్లీ పెళ్లి' ఒకటి. సీనియర్ నటుడు వీకే నరేష్, పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమాను సీనియర్ ఫిల్మ్ మేకర్ ఎమ్మెస్ రాజు తెరకెక్కించారు. నరేష్ రియల్ లైఫ్‌కు కొంత ఫిక్షనల్ కంటెంట్‌ను జోడించి ఈ సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా ఎన్నో అంచనాలను ఏర్పరచుకుని విడుదలకు సిద్ధం అవుతోంది.
కొంత కాలంగా నరేష్ - పవిత్ర మధ్య జరుగుతోన్న వ్యవహారాలను తెరపై చూపించే ప్రయత్నమే 'మళ్లీ పెళ్లి'. అనౌన్స్‌మెంట్‌తోనే ఈ సినిమా సంచలనంగా మారిపోయింది. దీంతో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. దీనికితోడు నరేష్, పవిత్ర కొద్ది రోజులుగా వరుసగా ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా 'మళ్లీ పెళ్లి' చిత్ర యూనిట్‌కు కోలుకోలేని షాక్ తగిలింది.

వీకే నరేష్ - పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన 'మళ్లీ పెళ్లి' చిత్రం మే 26వ తేదీన ఎంతో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో దీని విడుదలను ఆపాలని తాజాగా కేసు నమోదు అయింది. ఈ చిత్రంలో తన ప్రతిష్టను కించిపరిచేలా కొన్ని అసభ్యకరమైన సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ రమ్య రఘుపతి (నరేష్ భార్య) కోర్టును ఆశ్రయించారు. అంతేకాదు, వెంటనే ఈ సినిమా రిలీజ్‌ను నిలిపి వేయాలని కోరుతూ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉన్న ఫ్యామిలీ కోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై కోర్టులో విచారణ జరగాల్సి ఉంది.

ఇదిలా ఉండగా.. ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో వీకే నరేష్, పవిత్ర లోకేష్ నటించిన చిత్రమే 'మళ్లీ పెళ్లి'. ఈ సినిమాను విజయకృష్ణ మూవీస్ పతాకంపై నరేష్ నిర్మించారు. ఈ మూవీ తెలుగు, కన్నడ భాషల్లో రూపొందింది. దీనికి సురేష్ బొబ్బులి, అరుల్‌దేవ్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడడంతో బిజినెస్ కూడా మంచిగానే జరిగింది.


Click it and Unblock the Notifications











