హీరోగా మారిన వివి వినాయక్.. సీనయ్యగా అదిరిపోయాడు

Recommended Video

VV Vinayak’s 'Seenayya' Movie First Look Released !

హీరోలు డైరెక్టర్లయ్యారు.. డైరెక్టర్లు హీరోలయ్యారు.. సినిమా రంగంలో ఏదైన జరిగేందుకు ఆస్కారముంటుంది. అయితే కాలం ఒక్కటి కలిసి వస్తే ఏదైనా సాధ్యమవుతుంది. అలాగే వివి వినాయక్ కు ప్రస్తుతం కాలం వచ్చింది. హీరోగా అవతారమెత్తాడు. అయితే వినాయక్ కు నటించడం కొత్తేమీ కాదు.. ఠాగూర్ సినిమాలో అద్భుతమైన పాత్రలో జీవించి అందర్నీ మెప్పించాడు. ఇక పూర్తి స్థాయిలో కనిపించి అందర్నీ అలరించనున్నాడు.

డైరెక్షన్లో కొత్తదనం

డైరెక్షన్లో కొత్తదనం

వివి వినాయక్ అనగానే.. తెల్ల బట్టలు.. కార్లు, సుమోలు గాల్లో తేలిపోయే సినిమాలే గుర్తొస్తాయి. అయితే ఆయన సినిమా ట్రెండ్ ను మార్చేసి.. మేకింగ్లో కొత్త పుంతలు తొక్కించాడు. కామెడీ సినిమాలను తెరక్కించడం, యాక్షన్ సినిమాలో కూడా కామెడీ ట్రాక్ ను ఎలా నడిపించడం ఇలా ప్రతీదాంట్లో కొత్తదనం చూపించాడు.

హిట్లతో దూసుకుపోయిన వినాయక్

హిట్లతో దూసుకుపోయిన వినాయక్

దిల్, ఆది, సాంబ, చెన్నకేశవరెడ్డి, ఠాగూర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలతో నెం.1 డైరెక్టర్ గా స్టార్ స్టేటస్ ను అనుభవించాడు. మధ్యలో కొంచెం వెనుకబడినా మళ్లీ అదుర్స్ సినిమాతో తన సత్తా చాటాడు. కానీ మళ్లీ ఒకప్పటి వినాయక్ మాత్రం ప్రేక్షకులకు కనిపించలేదు..

వరుస ఫెయిల్యూర్స్..

వరుస ఫెయిల్యూర్స్..

అక్కినేని వారసుడు అఖిల్.. వినాయక్ దర్శకత్వంలో అఖిల్ చిత్రంతో పరిచయమయ్యాడు. అయితేఅది దారుణంగా బెడిసికొట్టింది. దాని ప్రభావం వినాయక్ మీదా పడింది. అయితే చిరు 150వ చిత్రానికి దర్శకత్వం చేసి మంచి విజయాన్నే అందుకున్నా.. సాయి ధరమ్ తేజ్ తో ఇంటెలిజెంట్ అంటూ దారుణమైన సినిమాను తెరకెక్కించాడు.

 హీరో మెటీరియల్ గా మలుచుకున్నాడు..

హీరో మెటీరియల్ గా మలుచుకున్నాడు..

దిల్ రాజు వచ్చి ఓ కథ వినమన్నాడని, కథ తనకు సూట్ అవుతుందని ఒప్పించాడని వివి వినాయక్ ఓ సందర్భంలో తెలిపాడు. అయితే హీరో పాత్రకు తగ్గట్టు లుక్, మేకోవర్ ను మార్చుకోవాల్సి ఉంటుందని, అందుకే బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపాడు. రీసెంట్ గా సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వినాయక్ ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అలాగే తాజాగా రిలీజ్ చేసిన సీనయ్య పోస్టర్ ను కూడా చూసి అందరూ షాక్ కు గురయ్యారు.

 నేటి నుంచి షూటింగ్ ప్రారంభం

నేటి నుంచి షూటింగ్ ప్రారంభం

నేడు వినాయక్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభిస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్స్ అదిరిపోయాయి. మాస్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా ఉన్నాడంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీలో వినాయక్.. మెకానిక్గా కనిపించనున్నట్లు అర్థమవుతుంది. ఈ చిత్రాన్నిశ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా.. మణిశర్మ సంగీతాన్ని అందించనున్నాడు. ఈ సినిమాకు నరసింహా దర్శకత్వం వహించనున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X