వివి వినాయక్ గొప్ప మనసు.. పేద కళాకారులకు ఆర్థిక సాయం

కరోనా వైరస్ ధాటికి ప్రపంచమంతా వణికిపోతోంది.. ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోవడంతో దినసరి కూలీ చేసుకునే వారి పరిస్థితి మరీ దయనీయంగా మారింది. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే సినీ పరిశ్రమ కూడా పూర్తిగా మూత పడటంతో అక్కడి కార్మికులు కూడా దిక్కులేని వారయ్యారు.

సినీ పరిశ్రమలో రోజూవారి వేతనాలు తీసుకుని పని చేసే కార్మికులను ఆదుకునేందుకు కొందరు హీరోలు ముందుకు వస్తున్నారు. వీరిలో రాజశేఖర్ ముందుగా అడుగు వేశారు. సినీ కార్మికులకు అవసరమ్యే నిత్యవసర సరుకులను తాను అందిస్తానని, అవసరైమన వారు తన ట్రస్ట్‌ను సంప్రదించమని కోరాడు.

VV vinayak Donates Five lakhs To Kadambari Kiran To help Needy In Tollywood

తాజాగా డైరెక్టర్ వివి వినాయక్ కూడా కదలి వచ్చాడు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను.. మనం వణికించాలని చెబుతూ.. సినీ పరిశ్రమలోని పేద కళాకారులకు సహాయార్థం ఐదు లక్షల చెక్కును కాదంబరి కిరణ్‌కు అందజేస్తున్నానని వినాయక్ పేర్కొన్నాడు. నిత్యావసర సరుకులు కొని అవసరమున్న వారికి అందజేయాలని కోరుతున్నానని తెలిపాడు. ఎవరికైనా నిజంగా అవసరముంటే.. కాదంబరి కిరణ్‌ను సంప్రదించండని కోరాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X