ఆ హీరోలిద్దరికి కథలు రెడీ చేస్తున్న వివి వినాయక్!
వివి వినాయక్ ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్. వివి వినాయక్ దర్శత్వంలో ఒక్కసారి నటిస్తే తమ మాస్ ఇమేజ్ పెరుగుతుందని హీరోలు భావించేవారు. పక్కా కమర్షియల్ అంశాలతో సినిమాలు రూపొందించి హిట్ కొట్టడం వివి వినాయక్ ప్రత్యేకత. గతంలో అల్లు అర్జున్, ఎన్టీఆర్, నితిన్ లాంటి హీరోలందరి మాస్ ఇమేజ్ పెంచింది ఈ దర్శకుడే. చిరంజీవి, బాలయ్యతో కూడా విమానాయక్ సినిమాలు చేశారు. కానీ ఖైదీ నెం 150 మినహా ఇటీవల వినాయక్ కు సరైన విజయం లేదు. అది కూడా రీమేక్ చిత్రం కావడంతో హిట్ క్రెడిట్ వివి వినాయక్ కు దక్కలేదు.
ఇదిలా ఉండగా వివి వినాయక్ ప్రస్తుతం తన తదుపరి చిత్రాల కోసం కసరత్తులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇద్దరు సీనియర్ హీరోలతో వివి వినాయక్ సినిమాలు చేయాలని భావిస్తున్నాడట. వివి వినాయక్, గోపి మోహన్ తో కలసి బాలయ్య, వెంకటేష్ ల కోసం కథలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ ఇద్దరి హీరోలలో వినాయక్ ముందుగా ఎవరితో చిత్రాన్ని తెరకెక్కిస్తారనే విషయంలో క్లారిటీ లేదు.

వెంకటేష్ ప్రస్తుతం వెంకీ మామ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత త్రినాధరావు నక్కినకు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక బాలయ్య ఎన్నికల తర్వాత బోయపాటి చిత్రంతో బిజీ కాబోతున్నాడు. వీరిద్దరిలో ముందుగా వినాయక్ కు ఎవరు ఓకే చెబుతారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











