‘వడ్డే నవీన్ ఎంత పవర్‌ఫుల్ అంటే.. వాళ్లు ఏకే 47 గన్‌లతో రౌండప్ చేసి’

దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత సీనియర్ హీరో వడ్డే నవీన్ మరోసారి రీ ఎంట్రీ ఇస్తున్నారు. అదే ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు. వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్‌పై వడ్డే నవీన్ స్వయంగా ఈ ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నవీన్ సరసన యంగ్ బ్యూటీ రాశీ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కమల్ తేజ్ దర్శకత్వం వహిస్తుండగా.. శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, శ్రీనివాస్ వడ్లమాని, జ్వాలా కోటి, దేవి ప్రసాద్, సూర్య, బాబా భాస్కర్, ప్రమోదిని, సాథ్విక్ రాజు, అంజలి ప్రియ, గాయత్రి చాగంటి తదితరులు కీలకపాత్రలు పోషించారు. జూన్ 19న ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ హాజరై కీలక వ్యాఖ్యలు చేశారు.

వడ్డే నవీన్ గారి గురించి, విజయ మాధవీ ప్రొడక్షన్స్, వాళ్ల నాన్నగారి గురించి చాలామందికి తెలుసు. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా, కో డైరెక్టర్‌గా పనిచేసిన నా ఆఖరి చిత్రం వడ్డే నవీన్ గారు హీరో. ఆయన సినిమాకు పనిచేస్తుండగా, నాకు ఆది సినిమా వచ్చింది. అది కూడా బెల్లంకొండ సురేష్ గారే తీశారు. ఈయన సినిమాకి నేను స్విట్జర్లాండ్ వెళ్లాను, అక్కడే ఎన్టీఆర్‌తో పరిచయం కానీ, ఆదికి నాంది కానీ అక్కడికి వెళ్లి పనిచేయడం వల్లే వచ్చింది. నన్నెంతో ప్రేమగా, ఇష్టంగా చూసుకునేవారు నవీన్ గారు. ఆయన కెరీర్‌లో 90 శాతం సినిమాలు ఇష్టంగా చేసినవి కావు. నేను ఆయన మనసులోకి దూరి చూశాను. నేను పనిచేసింది ఒక్క సినిమా అయినా కూడా చాలా మదనపడుతూ కనిపించేవారు నవీన్ గారు. ఏదైనా సీన్ వస్తే ఎలా చేయాలి? ఏం చేయాలి? ఏంటిది అనుకుంటూ ఉండేవారని వీవీ వినాయక్ పేర్కొన్నారు.

VV Vinayak Reveals Shocking Facts About Vadde Naveen s Influence at Transfer Trimurthulu Trailer Launch Event

ఒక రోజు నేను అనుకోకుండా ఒక సీన్ రాశాను. అది ఆయన చూసి ఎవరు రాశారు అని అడిగితే మామూలు రైటర్ పేరు చెప్పారు. కానీ నవీన్ గారు మాత్రం మనసులోనే కనిపెట్టి ఆరోజు మధ్యాహ్నం భోజనానికి పిలిచారు. ఆయనతో కలిసి భోజనం చేసిన తర్వాత వినయ్ నువ్వు చాలా మంచి డైరెక్టర్‌వి అవుతావు, ఈ అసిస్టెంట్‌గా పనిచేయడం మానేయ్.. నీకు ఏ సపోర్ట్ కావాలన్నా మన ఆఫీసులో వచ్చి కూర్చోమని చాలా ఇష్టంగా చూసేవారు. ఆయనకు పూర్తిగా నచ్చి చేసిన సినిమాలు చాలా తక్కువ. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కానీ, ఆయన పెరిగిన వాతావరణం కానీ, అప్పటికి ఆయన చూసిన సినిమాలు, తెలిసిన ప్రపంచం.. దానికి ఈక్వెల్‌గా ఇక్కడ ఎవరూ లేరు అని వీవీ వినాయక్ చెప్పారు.

నవీన్ గారి పలుకుబడి మామూలుది కాదు. మేం ఒకరోజు స్విట్జర్లాండ్ నుంచి షూటింగ్ చేసుకుని వస్తుండగా ఒక కాస్ట్యూమర్ ఫ్లైట్‌ టాయ్‌లెట్‌లో సిగరెట్ కాల్చాడు. మేం ఫ్లైట్ దిగి చెన్నై ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్లేసరికి ఏకే 47 గన్స్‌తో సెక్యూరిటీ వాళ్లు వచ్చి ఆ కాస్ట్యూమర్‌ని అరెస్ట్ చేశారు. ఎవరికీ ఏం తెలియదు, చెన్నైలో ఎవరికో వడ్డే నవీన్ గారు జస్ట్ ఒక ఫోన్ కాల్ చేసి మాట్లాడారు.. వెంటనే అతను బయటికొచ్చేశాడు. అది చేసి నవీన్ గారికి ఇంత ఇన్‌ఫ్లూయెన్స్ ఉందా? అని అనుకున్నాను. కానీ వెళ్లాల్సిన స్థాయికి నవీర్ గారు వెళ్లారని నేను అనుకోవడం లేదు. కానీ ఈ సినిమా పెద్ద హిట్ అయి, ఆయనకి నచ్చిన సినిమాలు రావాలని కోరుకుంటున్నాను అని వీవీ వినాయక్ అన్నారు.

అన్ని సంవత్సరాల తర్వాత నిన్ననే నవీన్ గారి ఫోన్‌కాల్‌లో ఆయన వాయిస్ విన్నాను. నవీన్ గారు అప్పుడెలా ఉన్నారో.. ఇప్పటికీ అలాగే ఉన్నారు హ్యాండ్సమ్‌గా. నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు.. మీరు అనుకున్నట్లుగానే కొంత వరకు సాధించగలిగాను, మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నవీన్ గారి అబ్బాయి సినిమాల్లోకి వస్తే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానని వీవీ వినాయక్ చెప్పారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారుతుండగా.. వడ్డే నవీన్ ఇన్‌ఫ్లూయెన్స్ గురించి నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X