VV Vinayak చేతుల మీదుగా పంచనామా. యువ నటుడి బర్త్ డే రోజున ఫస్ట్ లుక్

సినిమా పరిశ్రమలో దర్శకత్వం చేపట్టి సినిమాను ప్రేక్షకులతో మెప్పించడం ఓ సవాల్. అయితే కేవలం డైరెక్షన్ కాకుండా కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ లాంటి అదనపు బాధ్యతలను భుజానికెత్తుకొని పంచనామా అనే క్రేజీ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు దర్శకుడు సిగటాపు రమేష్ నాయుడు. ఈ చిత్రంలో నటిస్తున్న హీరో వెంప కాశీ పుట్టిన రోజును పురస్కరించుకొని పంచనామా సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సెన్సేషనల్ అండ్ మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ ఆవిష్కరించడం విశేషంగా మారింది. ఈ సందర్భంగా వీవీ వినాయక్ మాట్లాడుతూ..

వెంప కాశీని ఎన్నోసార్లు సినిమాలో నటించమని అడిగాను. కానీ ఆయన పంచనామ అనే సినిమాలో చేశారనే వార్త వినగానే షాక్‌కు గురయ్యాను. సినిమా చేయడానికి కారణాలు, క్యారెక్టర్ గురించి డైరెక్టర్ చెప్పిన విధానం నన్ను విశేషంగా ఆకట్టుకొన్నది. ఆ క్యారెక్టర్ గురించి విన్న తర్వాత ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని కోరుకున్నాను. డైరెక్టర్ సిగటాపు రమేష్ నాయుడుకి నా మనస్పూర్తిగా దీవెనలు తెలుపుతున్నాను అని వినాయక్ అన్నారు.

VV Vinayak unveiled Panchanama first look gets good response

పంచనామా సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ చూడగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతుంది పోస్టర్ చూసిన తర్వా త ఎంత కసిగా చేసారనే విషయం స్పష్టమైంది. పంచనామ చిత్ర యూనిట్ సభ్యులందరికి నా అభినందనలు తెలుపుతున్నాను అని వినాయక్ తెలిపారు.

డైరెక్టర్ సిగటాపు రమేష్ నాయుడు మాట్లాడుతూ.. వివి వినాయక్ బిజీగా ఉన్నప్పటికీ మేము ఆహ్వానించగానే వచ్చారు. ఆయన చేతులు మీదగా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ లాంచ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయనని నేను బ్రహ్మ అని పిలుచుకుంటాను. నాకు ఇష్టమైన డైరెక్టర్స్‌లో వినాయక్ ఒకరు. ఆయన ఇచ్చిన దీవెనలు నాలో మరింత పాజిటివ్ ఎనర్జీని నింపాయి. వినాయక్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను అని అన్నారు.

VV Vinayak unveiled Panchanama first look gets good response

నటీనటులు: త్రిపుర నిమ్మగడ్డ, వెంప కాశీ, సంజీవ జాదవ్, ముక్కు అవినాష్, ఆలపాటి లక్ష్మి, ఆంజనేయులు (జూనియర్ రాజశేఖర్ )తదితరులు
రచన, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: సిగటాపు రమేష్ నాయుడు
నిర్మాతలు: గద్దె శివ కృష్ణ, వెలగ రాము
ఎడిటర్: బసవ రెడ్డి
సినిమాటోగ్రఫీ: పవన్ గుండుకు
సంగీతం: ప్రదీప్ చంద్ర
పీఆర్‌వో: మధు
బ్యానర్: హార్దిక్ క్రియేషన్స్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X