Project K అంటే ఏంటీ? అధికారికంగా చెప్పనున్న మేకర్స్... ఎప్పుడో తెలుసా?
జగదేక వీరుడు అతిలోక సుందరి, రాజకుమారుడు, స్టూడెంట్ నెంబర్ 1, ఇంద్ర, దేవదాస్, మహానటి, సీతా రామం వంటి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్స్ అందించిన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థగా పేరొందిన ఈ సంస్థ తాజాగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నసినిమా ప్రాజెక్ట్ కె. భారీ తారాగణం నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, మేకింగ్ వీడియోలు మంచి క్యూరియాసిటీ పెంచాయి. అంతేకాకుండా అసలు ప్రాజెక్ట్ కె అంటే ఏంటో తెలుసుకోవాలని ఆడియెన్స్, సినీ ప్రియులు ఆరాటపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు మేకర్స్ కీలక అప్డేట్ ఇవ్వనున్నారు.
మహానటితో నేషనల్ అవార్డ్ సాధించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మూవీ ప్రాజెక్ట్ కె. ఇందులో లోకనాయకుడు కమల్ హాసన్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, హాట్ బ్యూటిలు దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి అతిపెద్ద తారాగణం నటిస్తోంది. అలాగే కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. ఇంకా వాటిని పెంచేలా పోస్టర్స్, వీడియోస్ కూడా వదిలారు.

విష్ణువు చివరి అవతారం కల్కిగా ప్రభాస్ పాత్ర ఉండబోతున్న ప్రాజెక్టె కె నుంచి విడుదలైన పోస్టర్స్, మేకింగ్ వీడియోలు క్యూరియాసిటీ పెంచేశాయి. అయితే సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె ప్రాజెక్ట్ కె టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ ను ప్రపంచవేదిక అయిన అమెరికా శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC)పై విడుదల చేయనున్నారు. జూలై 20న టైటిల్ తో పాటు గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ప్రాజెక్ట్ కె అంటే ఏంటో తెలుసుకోవాలని ఎంతోమంది ఉత్సాహం చూపిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ కె మేకర్స్ అదిరిపోయే న్యూస్ చెప్పారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. "ప్రాజెక్ట్ కె అంటే ఏంటో ప్రపంచం మొత్తం తెలుసుకోవాలనుకుంటుంది. అది తెలుసుకునే సమయం వచ్చేసింది. దానికి సంబంధించిన విషయాన్ని ఇవాళ (జూలై 8) రాత్రి 7 గంటల 10 నిమిషాలకు వెల్లడించనున్నాం" అని వైజయంతీ మూవీ మేకర్స్ అధికారిక పేజ్ ఇన్ స్టాలో పోస్ట్ షేర్ చేసింది. అంతేకాకుండా ఒక ఫొటో కూడా పంచుకుంది. అందులో రెండు చేతులు తలపడుతున్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











