కొత్త అడుగు వేసిన వైజయంతీ మూవీస్.. అదిరిపోయే అవకాశం

ప్రస్తుతం నిర్మాణ సంస్థలన్నీ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కరోనా వైరస్, లాక్డౌన్ వచ్చి ప్రజల జీవన పరిస్థితులను ఎన్నో రకాలుగా మార్చేశాయి. ముఖ్యంగా అందరికీ ఓటీటీ బాగా అలవాటు అయింది. దాదాపు ఏడెనిమిది నెలలు థియేటర్లకూ దూరంగా ఉండటం వల్ల అందరూ కూడా ఓటీటీనే ఆశ్రయించారు. కొత్త కాన్సెప్ట్‌లు, కొత్త కథలు, కొత్త ఫ్లాట్‌ఫాంలతో ప్రేక్షకులను మెప్పించేందుకు దర్శన నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అందుకు తగ్గట్టు నిర్మాణ సంస్థలు కూడా సన్నద్దమవుతున్నాయి.

వెబ్ సిరీస్‌లో, వెరైటీ షోలు, కొత్త కథలను ప్రోత్సహిస్తున్నారు. అందుకే వైజయంతీ మూవీస్ కూడా ఓ అడుగు ముందుకు వేసినట్టు కనిపిస్తోంది. ఆ బ్యానర్‌లో ఏదో కొత్తగా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా వారు చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ఊర్లోనే షూటింగ్.. ఆ ఊరి ప్రజలే యాక్టర్స్ అంటూ క్యాస్టింగ్ కాల్‌ను ప్రకటించారు. మొత్తానికి నటన మీద ఆసక్తి ఉన్న వాళ్లకు ఇది మంచి అవకాశంలానే కనిపిస్తోంది.

Vyjayanthi Movies casting call For show

ఒక చిన్న ఆడిషన్, మీ పెద్ద ఊరిలో, మా కొత్త షో కోసం అంటూ క్యాస్టింగ్ కాల్ కోసం ప్రకటన ఇచ్చారు. వైజయంతీ మూవీస్‌లొ భాగంగా ఎర్లీ మన్‌సూట్ టేల్‌పై రాబోతోన్న ఈ షో కోసం క్యాస్టింగ్ కాల్ ప్రకటన ఇచ్చారట. అయితే ఇది రాజమండ్రి చుట్టు పక్కల ఉన్న ప్రజలకు మాత్రమే అని తెలుస్తోంది. ఏది ఏమైనా వైజయంతీ మూవీస్ బ్యానర్ నుంచి కొత్తగా రాబోతోందని తెలుస్తోంది. మరి ఈ షో ఎలా ఉంటుందో చూడాలి. ఆహాలో ఇప్పటికే సమంత సామ్ జామ్ బాగానే క్లిక్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X