Waltair Veerayya: ఎట్టకేలకు టీవీల్లోకి వాల్తేరు వీరయ్య.. ఆలస్యం ఎందుకు అయిందంటే?

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజలు కలిసి బ్రదర్స్ గా కలిసి నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య గురించి అందరికీ తెలిసిందే. ఈ ఏడాది జనవరి నెలలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా రూ.225 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి మెగా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. థియేటర్లలో మెగా అభిమానులకు పెద్ద ఎత్తున పూనకాలు తెప్పించింది. ఓటీటీలోనూ విడుదలై అందరినీ అలరించింది.

అయితే ఈ చిత్రం విడుదలై 9 నెలలు గడుస్తుండగా... ఇప్పుడు టీవీల్లోకి రాబోతుంది. ఇంత వరకూ ఈ చిత్రం టీవీల్లోకి రాకపోవడంతో ఆంతా అశ్చర్యపోయారు. కానీ తాజాగా ఈ చిత్రం జెమినిలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. వాల్తేరు వీరయ్య సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా శాటిలైట్ హక్కులను సన్ నెట్ వర్క్ గ్రూపుకు చెందిన జెమినీ టీవీ దక్కించుకుంది. ఈసినిమాను ఇంట్లోనే కూర్చొని చూడాలనుకున్న వాళ్లు రెడీ అయిపోండి.

Waltair Veerayya Movie Will be Telecast on October 23rd at 6 PM on Gemini Tv

దసరా సందర్భంగా అక్టోబర్ 23వ తేదీ సాయంత్రం 6 గంలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అలాగే ట్విట్టర్ వేదికగా ప్రోమోను కూడా విడుదల చేశారు. వాస్తవానికి ఓటీటీలు వచ్చిన తర్వాత టెలివిజన్ ప్రీమిర్లపై ప్రేక్షకులు పెద్ద ఆసక్తి చూపడం లేదు. థియేట్రికల్ గా రిలీజైన నాలుగు అయిదు వారాల్లోనే ఓటీటీలోకి వస్తుండడంతో అంతా చూసేస్తున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే, ఓటీటీలో సబ్ స్క్రిప్షన్ లేని వాళ్లు మాత్రమే ఛానెళ్లలో చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎంత పెద్ద సినిమా అయనా సరే టీఆర్పీ రేటింగ్ రాబట్టడం లేదు. అందుకే అసలు ఏ సినిమా ఎప్పుడు టీవీలోకి వస్తుందో కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు.

బాబీ కొల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రుతి హాసన్, కేథరిన్ థ్రెసా, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. తెలుగుతో పాటు హిందీలోనూ వచ్చిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ లో చేసింది. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, బాబీ సింహా, నాజర్, సత్యరాజ్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, ప్రదీప్ రావత్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, షకలక శంకర్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. అలాగే మాస్ మహారాజ రవితేజ ఈ సినిమాలో చిరు కు బ్రదర్ గా కనిపించి.. సాలిడ్ పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టారు.

Waltair Veerayya Movie Will be Telecast on October 23rd at 6 PM on Gemini Tv

వాల్తేరు వీరయ్య చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ లు నిర్మించారు. బాబీ కథ మాటలు అందించగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్ ప్లే అందించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఆర్థర్ ఎ ిల్సన్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. నిరంజన్ దేవరమానె ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X