twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Waltair Veerayya: ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్.. ఈ సారి డబుల్ మాస్ ట్రీట్

    |

    సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాల మీద సినిమాలను లైన్‌లో పెట్టుకుంటూ గతంలో ఎన్నడూ లేనంత వేగంతో దూసుకుపోతోన్నారు టాలీవుడ్ బడా హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే ఆయన పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. వాటి ఫలితాలను అస్సలు పట్టించుకోకుండా మరిన్ని చిత్రాలు చేస్తూ వెళ్తున్నారు. ఇలా ప్రస్తుతం ఆయన నటిస్తోన్న చిత్రాల్లో 'వాల్తేరు వీరయ్య' ఒకటి. ఇందులో మాస్ మహారాజా రవితేజ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. సక్సెస్‌ఫుల్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డ విషయం తెలిసిందే.

    Bigg Boss: డబుల్ ఎలిమినేషన్ వెనుక కుట్ర.. ఒకరి బదులు మరొకరు ఎలిమినేట్.. లీకైన సెన్సేషనల్ న్యూస్Bigg Boss: డబుల్ ఎలిమినేషన్ వెనుక కుట్ర.. ఒకరి బదులు మరొకరు ఎలిమినేట్.. లీకైన సెన్సేషనల్ న్యూస్

    క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'వాల్తేరు వీరయ్య' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అప్పటి నుంచి పలు షెడ్యూళ్లను జరుపుతూ వచ్చారు. ఇలా ఇప్పటికే ఈ సినిమా టాకీ పార్టును దాదాపుగా పూర్తి చేసుకున్నారు. దీంతో చిత్ర యూనిట్ ఈ మూవీ ప్రచార చిత్రాలను వదిలి.. దీన్ని ప్రేక్షకులకు చేరువ చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే దీపావళి పండుగ కానుకగా టైటిల్ టీజర్‌ను విడుదల చేసింది. దీనికి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ప్లాన్ చేస్తోంది.

    Waltair Veerayya Team to Release Ravi Teja Teaser

    ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'వాల్తేరు వీరయ్య' మూవీలో మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అతడి పాత్రకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఈ వీడియోను నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు ఓ న్యూస్ తాజాగా లీకైంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కట్ కూడా కంప్లీట్ అయినట్లు తెలిసింది. ఇక, దీనికి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రానుందని సమాచారం.

    బికినీ సైజ్ తగ్గించేసిన స్టార్ హీరోయిన్: అబ్బో ఇలా తెగించేసిందేంటి!బికినీ సైజ్ తగ్గించేసిన స్టార్ హీరోయిన్: అబ్బో ఇలా తెగించేసిందేంటి!

    'వాల్తేరు వీరయ్య' మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు.

    English summary
    Megastar Chiranjeevi Now Doing Waltair Veerayya Movie Under K. S. Ravindra Direction. Ravi Teja Teaser Will Release From This Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X