Waltair Veerayya: చిరంజీవికి విలన్‌గా స్టార్.. సీజర్‌ను పరిచయం చేసిన టీమ్
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేనంత దూకుడుగా సినిమాలు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే ఎన్నో చిత్రాలను కూడా ఆయన ప్రేక్షకులకు అందించారు. వాటి ఫలితాలు ఎలా ఉన్నా.. ఆయన మాత్రం వరుసగా సినిమాల మీద సినిమాలను లైన్‌లో పెట్టుకుంటూనే వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఆయన 'గాడ్ ఫాదర్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచానలతో విడుదలైన ఈ చిత్రానికి అదిరిపోయే టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే కలెక్షన్లు కూడా పోటెత్తాయి. ఇక, ఈ మూవీ రిజల్ట్‌తో చిరంజీవి ఫుల్ జోష్ మీదున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'వాల్తేరు వీరయ్య' అనే సినిమాలో నటిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కూడా కీలక పాత్రను చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ దాదాపుగా పూర్తైపోయింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన డబ్బింగ్ వర్క్‌తో పాటు కొన్ని కీలకమైన పనులు జరుగుతున్నాయి. ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ పోస్టర్ వచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి - బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న 'వాల్తేరు వీరయ్య' మూవీలో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు ఇప్పటికే తెలిసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ మూవీలో నెగెటివ్ రోల్‌ను చేస్తోన్న బాబీ సింహా పాత్రను చిత్ర యూనిట్ ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈరోజు ఆ ప్రముఖ నటుడి పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని అతడు ఇందులో చేస్తోన్న 'సీజర్' అనే పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో బాబీ అదిరిపోయే లుక్‌తో దర్శనమిచ్చాడు. దీంతో అతడి పాత్రపై అంచనాలు ఏర్పడ్డాయి.
'వాల్తేరు వీరయ్య' మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ కూడా ఈ మూవీలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











