Waltair Veerayya Teaser Review మాస్ మూలవిరాట్టుగా చిరంజీవి.. ఇక పూనకాలు.. అరాచకమే!

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై దర్శకుడు బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్, మసాలాలతో చిరంజీవి వింటేజ్‌లుక్‌తో మరోసారి అభిమానులతో కేక పెట్టించేందుకు మెగాస్టార్ చిరంజీవి సిద్దమయ్యారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, టీజర్‌ను దీపావళీ పండుగ సందర్భంగా రిలీజ్ చేశారు.

154వ చిత్రంగా వాల్తేర్ వీరయ్య

154వ చిత్రంగా వాల్తేర్ వీరయ్య

చిరంజీవి తన కెరీర్‌లో 154వ చిత్రంగా నటిస్తున్న మూవీకి వాల్తేర్ వీరయ్యగా టైటిల్ ఖారారు. చేశారు. ఎప్పటి నుంచో ఈ టైటిల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అభిమానుల నోట నానుతున్న ఈ టైటిల్‌తోనే మైత్రీ మూవీ మేకర్స్ వెళ్లడానికి డిసైడ్ అవ్వడమే కాకుండా టైటిల్, టీజర్‌ను రిలీజ్ చేశారు. రొటీన్‌గా ఉన్నప్పటికీ ఈ టీజర్ మాస్ ఎలిమెంట్స్‌తో అభిమానులకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.

పూనకాలు.. అరాచకాలు అంటూ

పూనకాలు.. అరాచకాలు అంటూ

వాల్తేర్ వీరయ్య టీజర్ విషయానికి వస్తే.. ఒక రౌడీ తన డెన్‌లో వాల్తేర్ వీరయ్య గురించి అవాకులు చెవాకులు పేలుతుంటాడు. ఏంటిరా.. మీ అన్నయ్య వస్తే.. పూనకాలు, అడుగేస్తే అరాచకాలు అన్నారు. సౌండే లేదు అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడుతాడు. అప్పుడే భారీ విస్పోటనంతో మంటలు చెలరేగుతాయి.

పూల చొక్కా.. నోట్లో బీడీతో

పూల చొక్కా.. నోట్లో బీడీతో

టీజర్‌లో వాల్తేర్ వీరయ్య ఎంట్రీని మంచి జోష్, ఊపును కలిపి మాస్ ఎలిమెంట్స్‌తో చూపించారు. చేతిలో బీడీ, పూలపూల షర్ట్,.. ముఖాన రఫ్‌గా గెడ్డం, మెడలో బంగారు చైన్లు, చేతికి ఖరీదైన వాచీతో పక్కా మాస్ మూలవిరాట్టుగా అనే విధంగా వాల్తేర్ వీరయ్య కనిపించాడు.

ఎంటర్‌టైనింగ్ ధమాకాలు చూడాలంటే

ఎంటర్‌టైనింగ్ ధమాకాలు చూడాలంటే

నోటిలో బీడిని చిరంజీవి రఫ్ ఆడిస్తూ.. ఇలాంటి ఎంటర్‌టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలంటే.. లైక్ షేర్, సబ్‌స్క్రైబ్ టూ వాల్తేర్ వీరయ్య అంటూ చిరంజీవి తనదైన శైలిలో డైలాగ్‌తో రచ్చ చేశాడు. కాలుతున్న కట్టెను తీసుకొని బీడీ ముట్టించి.. స్టైయిల్‌గా చిరంజీవి నడుచుకొంటూ వెళ్లిపోవడంతో వాల్తేర్ వీరయ్య టీజర్ ముగిసింది.

రవితేజ ఫైనల్ టచ్ ఇలా..


ఇక మాస్ ఎలిమెంట్స్‌తో ఉన్న చిరంజీవి వాల్తేరు వీరయ్యకు మాస్ మహారాజ్ రవితేజ ఫైనల్ టచ్ ఇచ్చాడు. టీజర్ ఎండింగ్‌లో రవితేజ.. హ్యాపీ దీవాళీ.. తొందర్లోనే కలుద్దాం అంటూ ఫ్యాన్స్‌లో జోష్ పుట్టించాడు. చిరంజీవికి శృతిహాసన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి బరిలో దూకింది. జనవరి రెండోవారంలో రిలీజ్ కానున్నది.

వాల్తేరు వీరయ్యలో తెర ముందు.. తెర వెనుక

వాల్తేరు వీరయ్యలో తెర ముందు.. తెర వెనుక

నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతిహాసన్, క్యాథరీన్ త్రెసా తదితరులు
కథ, డైలాగ్స్, దర్శకత్వం: బాబీ (రవీంద్ర కొల్లి)
స్క్రీన్ ప్లే: కోన వెంకట్, చక్రవర్తి రెడ్డి
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
డీవోపీ: ఆర్థర్ ఏ విల్సన్
ఎడిటర్: నిరంజన్ దేవరామనే
ఫైట్స్: రామ్ లక్ష్మణ్
క్యాస్టూమ్ డిజైనర్: సుస్మిత కొణిదెల
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాశ్
పీఆర్వో: వంశీ శేఖర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X