War 2 Pre Release Event: రేవంత్ రెడ్డి పేరు మరిచిపోయిన ఎన్టీఆర్.. సీఎంకు వార్ 2 హీరో క్షమాపణలు

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం వార్ 2. ఆగస్ట్ 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా ఆగస్ట్ 10వ తేదీన హైదరాబాద్ యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లు ఉద్వేగంగా ప్రసంగించారు. అయితే ఈ ఈవెంట్‌లో ఒక చిన్న తప్పు జరగడంతో ఎన్టీఆర్ స్పందించారు. ఈ వివరాల్లోకి వెళితే..

ఒళ్లు దగ్గర పెట్టుకుని సినిమా చేశా
స్టార్ యాంకర్ సుమ కనకాల ఈ మెగా ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు. తనదైన వాక్చాతుర్యం, సమయస్పూర్తితో ఈవెంట్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇంగ్లీష్‌లో ప్రసంగించగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దానిని తెలుగులోకి అనువదించారు. వార్ 2లో మిమ్మల్ని కలుసుకోవడం నా అదృష్టమన్నారు. నేను దర్శకత్వం వహించిన బ్రహ్మస్త్రకు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా రావాల్సి ఉందని, కానీ ఇప్పుడు నేను ఆయనను డైరెక్ట్ చేయడం ఒక డెస్టినీ అన్నారు అయాన్ ముఖర్జీ. వార్‌2లో గొప్ప కథ ఉందని, దానిని కొంచెం కూడా మేం చెప్పలేదని రేపు థియేటర్‌లో కథ ఆశ్చర్చపరుస్తుందని అయాన్ తెలిపారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లాంటి ఇద్దరు గొప్ప స్టార్స్‌ని ఈ స్క్రిప్ట్‌లోకి తీసుకొచ్చి వారిని డైరెక్ట్ చేయడం అనే బాధ్యతను ఒళ్లు దగ్గర పెట్టుకుని నిర్వర్తించానని అయాన్ తెలిపారు.

War 2 Pre Release Event Jr NTR Apologizes to Telangana CM Revanth Reddy Video goes viral

ఎన్టీఆర్ మీకు అన్న.. నా తమ్ముడు
ఆ తర్వాత హృతిక్ రోషన్ మాట్లాడుతూ.. గతంలో క్రిష్ సినిమా కోసం హైదరాబాద్‌కు వచ్చానని గుర్తుచేసుకున్నారు. తెలుగు ప్రజల ఆతిథ్యం, ప్రేమ నాకెంతో నచ్చిందని తెలిపారు. తారక్ మీకు అన్న.. నాకు తమ్ముడు.. మనమెంత బ్రదర్స్ అని మీ అభిమానానికి ఫిదా అయిపోయానని హృతిక్ అన్నారు. వార్ 2లో యాక్షన్ సన్నివేశాల కోసం ఎంతో కష్టపడ్డాం.. కొన్నిసార్లు దెబ్బలు తగిలి నేను విలవిలలాడుతుంటే ఎన్టీఆర్ మాత్రం పంటి బిగువున బాధను భరించి షూటింగ్ పూర్తి చేశాడని హృతిక్ రోషన్ ప్రశంసించారు. తారక్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని.. నూటికి నూరు శాతం పర్ఫెక్షన్‌తో షాట్‌కి ఎలా వెళ్లాలో ఎన్టీఆర్‌ను చూసి నేర్చుకున్నానని హృతిక్ తెలిపారు. తారక్ మంచి నటుడే కాదు.. మంచి చెఫ్ కూడా అని, అతను చేసే బిర్యానీ అంటే నాకెంతో ఇష్టమని హృతిక్ అన్నారు.

నన్నెవరూ ఆపలేరు
ఇక ఎన్టీఆర్ తన మాస్ స్పీచ్‌తో పూనకాలు తెప్పించారు. ఇది హిందీ సినిమా కాదు.. తెలుగు సినిమాయేనని తెలిపారు. నా తొలి సినిమా ఓపెనింగ్‌కు అమ్మానాన్న తప్పించి ఎవరూ లేరని .. అప్పుడు మొదలైన జర్నీ 25 ఏళ్లు సాగిందని తారక్ గుర్తుచేసుకున్నారు. పాతికేళ్ల క్రితం కహోనా ప్యార్ హై సినిమాలో హృతిక్ డ్యాన్స్ చూసి మెస్మరైజ్ అయ్యానని ఇండియాలో ఉన్న గొప్ప డ్యాన్సర్ ఎవరంటే అది ఖచ్చితంగా హృతిక్ రోషనే. ఆయనతో కలిసి డ్యాన్స్ చేయడం నా అదృష్టమన్నారు ఎన్టీఆర్. యశ్ రాజ్ ఫిల్మ్ యూనివర్స్‌లోకి నన్ను తీసుకున్న ఆదిత్య చోప్రా గారికి తారక్ ధన్యవాదాలు తెలిపారు. వార్ 2 సినిమా అదిరిపోయిందని, ఎన్నో ట్విస్టులు ఉన్నాయని .. బొమ్మ అదిరిపోయిందని నన్నెవరూ ఆపలేరని ఎన్టీఆర్ అన్నారు.

రేవంత్ రెడ్డికి ఎన్టీఆర్ క్షమాపణలు
అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ముగిసిన తర్వాత వార్ 2 ఈవెంట్‌లో తప్పు జరిగిందంటూ ఎన్టీఆర్ స్పెషల్ వీడియో ఒకటి రిలీజ్ చేయడం కలకలం రేపింది. అందులో ఆయన ఏమన్నారంటే... 'అందరికీ నమస్కారం.. ఇందాక ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మరిచిపోయాను. నన్ను క్షమించాలి. అభిమానులతో పాతిక సంవత్సరాల జర్నీని పంచుకునే ఆనందంలో ఒక తప్పిదం జరిగింది. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, వారి సహయ సహకారాలు మాకు అందించినందుకు నా కృతజ్ఙతలు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారికి , ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి అలాగే హైదరాబాద్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి, యావత్ తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి నా కృతజ్ఞతలు, శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. మీ సహాయ సహకారాలు మాకు అందించినందుకు ధన్యవాదాలు' అంటూ ఎన్టీఆర్ ముగించారు.

తప్పు సరిదిద్దిన ఎన్టీఆర్
వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన ప్రసంగంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పోలీస్ శాఖను ప్రస్తావించకపోవడాన్ని కార్యక్రమం ముగిసిన తర్వాత ఎన్టీఆర్ గుర్తించారు. ఆ వెంటనే తప్పును సరిదిద్దుతూ స్పెషల్ వీడియో చేశారు. గతంలో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును బన్నీ మరిచిపోయారు. టికెట్ రేట్లు పెంపుకు, బెనిఫిట్ షోలకు అనుమతించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు, తెలంగాణ ప్రభుత్వానికి అల్లు అర్జున్ వేదిక మీదే థ్యాంక్స్ చెప్పారు.

రేవంత్ రెడ్డి పేరు మరిచిపోయిన అల్లు అర్జున్
అయితే ఆ సమయంలో రేవంత్ రెడ్డి పేరు బన్నీకి గుర్తు రాలేదు. దీంతో మంచినీరు తాగి కొంత సమయం తర్వాత రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్‌లో వైరల్ కావడంతో.. తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించాయి. ఆ తర్వాత సంథ్య థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ వంటి ఘటనలు వెంట వెంటనే జరిగిపోయాయి. అయితే ఇలాంటి తప్పు జరగకుండా, నెటిజన్లకు అవకాశం ఇవ్వకుండా ఎన్టీఆర్ స్వయంగా బాధ్యత తీసుకుని రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పి వివాదానికి అవకాశం లేకుండా చేశారు.

More from Filmibeat

Read more about: war 2 jr ntr revanth reddy
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X