War 2 Pre Release Event: వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఫిక్స్.. హృతిక్, ఎన్టీఆర్.. వేడుకకు గెస్ట్‌లు ఎవరంటే?

బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వార్ 2. దిగ్గజ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో వార్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌‌గా నటిస్తుండగా.. అషుతోష్ రాణా, అనిల్ కపూర్‌ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బెంజమిన్ జాస్పర్ సినిమాటోగ్రాఫర్‌గా, ఆరిఫ్ షేక్‌ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రీతం సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారాలు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్ట్ 14న వార్ 2 చిత్రం వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.

అడ్వాన్స్ బుకింగ్‌లో వార్ 2 హవా
హృతిక్ రోషన్ - ఎన్టీఆర్ కాంబో కావడంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ తొలిసారిగా హిందీలో నటిస్తున్న సినిమా కావడంతో వార్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే టీజర్, ట్రైలర్లతో ఈ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ క్రమంలోనే హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, ఓవర్సీస్ మార్కెట్స్‌లో ఓ రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 హిందీ, తెలుగు డబ్బింగ్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ దక్కించుకుంది.

War 2 Pre Release Event Sithara Entertainments set all arrangements for Hrithik Roshan and Jr NTR s Film Event

అడ్వాన్స్ బుకింగ్‌లో వార్ 2 దూకుడు
అటు అడ్వాన్స్ బుకింగ్‌లో వార్ 2 దుమ్మురేపుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలోని యూఎస్ఏ, కెనడా దేశాలలో ప్రీమియర్స్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. వార్ 2 ప్రీమియర్స్ కోసం పుష్ప 2 మాదిరిగా మెగా బ్లాక్‌బస్టర్ ధర నిర్ణయించాలని యశ్ రాజ్ ఫిల్మ్స్ థియేటర్లను కోరుతోంది. దేశంలోని మెజారిటీ భాషలలో రిలీజ్ అవుతుండటంతో పాటు సినిమాపై ఉన్న అంచనాలతో వార్ 2కు భారీ డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు. అయితే పుష్ప 2 కోసం హిందీ ఆడియన్స్‌ అత్యంత ఆసక్తితో ఎదురుచూడటంతో ప్రీమియర్స్, అడ్వాన్స్ బుకింగ్‌కు స్పందన ఓ రేంజ్‌లో ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ఈ సినిమా దాదాపు 3 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

వార్ 2కి సెన్సార్ కట్స్
ఇకపోతే.. వార్ 2కి సెన్సార్ బోర్డ్ కొన్ని కట్స్ చెప్పినట్లుగా చిత్ర సీమలో కథనాలు వస్తున్నాయి. ఆవాన్ జవాన్ పాటలోని కొన్ని సీన్లను తొలగించాలని నిర్మాతలకు సెన్సార్ బోర్డ్ సూచించిందట. ఆగస్ట్ 8 నాటికి ఈ సినిమా అసలు రన్‌టైమ్ 179.49 నిమిషాలు.. కొత్తగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలను బట్టి ఇది ప్రస్తుతం 71.44 నిమిషాలకు తగ్గినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. వార్ 2 సెన్సార్‌కి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై క్లారిటీ
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో వార్ 2 యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇప్పటికే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి డ్యాన్స్ చేసిన పాటను రిలీజ్ చేయగా ఇది యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దుమ్మురేపుతోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరగనున్నాయి. దీనిలో భాగంగా విజయవాడలో వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వీటికి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెరదించింది. ఆగస్ట్ 10వ తేదీన సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో హృతిక్ రోషన్‌తో పాటు ఎన్టీఆర్, కియారా అద్వానీ చిత్ర యూనిట్ పాల్గొంటుందని సితార ఎంటర్‌టైన్మెంట్స్ తెలిపింది. టాలీవుడ్‌కు చెందిన కొందరు ప్రముఖులు కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొంటారని వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Read more about: war 2 hrithik roshan jr ntr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X