WAR 2 Teaser: నా గురించి తెలుసుకుంటావ్.. హృతిక్‌కి ఎన్టీఆర్ వార్నింగ్

ఆర్ఆర్ఆర్‌తో గ్లోబల్ ఇమేజ్ సంపాదించిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్ నటిస్తోన్న వార్ 2లో ఎన్టీఆర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి మధ్య సీన్స్‌కు సంబంధించిన పోస్టర్స్ వైరల్ కావడంతో వార్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వార్ 2 చిత్ర యూనిట్ ఆయనను సర్‌ప్రైజ్ చేసింది. ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ను రిలీజ్ చేసింది. మరి అది ఎలా ఉందో పరిశీలిస్తే..

ఆగస్ట్ 14న వార్ 2 రిలీజ్

వార్ 2తో ఎన్టీఆర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్త తెలిసినప్పటి నుంచి టాలీవుడ్, బాలీవుడ్‌లలో ఒకటే చర్చ జరుగుతోంది. ఇందులో ఆయన రోల్ ఏంటీ? హృతిక్‌తో సమానమైనా నిడివి ఉంటుందా? లేక గెస్ట్ రోల్ మాత్రమేనా? అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ తెరకెక్కిస్తోంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా అశుతోష్ రాణా, అనిల్ కపూర్‌‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నట్లుగా బాలీవుడ్ టాక్. వార్ 2కి ప్రీతమ్ స్వరాలు అందిస్తుండగా సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారాలు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్ట్ 14న వార్ 2ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

WAR 2 Teaser Jr NTR declares war on Hrithik Roshan here s the Ayan Mukerji s action packed teaser in telugu

ఎన్టీఆర్‌ది నెగిటివ్ పాత్రా?

అయితే వార్‌ 2లో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏంటనేది నేటి వరకు తెలియరాలేదు. బాలీవుడ్ మీడియా చెబుతున్న దానిని బట్టి ఇందులో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ పోషిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే ఎన్టీఆర్ రెమ్యునరేషన్ కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. వార్ 2లో నటించినందుకు గాను హృతిక్ రోషన్ దాదాపు రూ.50 కోట్ల పారితోషికం తీసుకుంటుండగా.. ఎన్టీఆర్‌కు రూ.30 కోట్లు ముట్టినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న కియారా అద్వానీకి రూ.15 కోట్ల పారితోషికం కింద చెల్లించినట్లుగా బీటౌన్ టాక్.

ఎన్టీఆర్‌కు బర్త్ డే ట్రీట్

షూటింగ్ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు వార్ 2 నుంచి ఎలాంటి అప్‌డేట్స్ కానీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కానీ వదలకుండా గోప్యంగా ఉన్న యష్ రాజ్ ఫిలింస్ తాజాగా మే 20వ తేదీ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా చిన్న గ్లింప్స్ వదిలింది. ఈ సినిమా కథేంటీ అన్నదానిపైనా చిన్న హింట్ ఇచ్చి వదిలారు అయాన్ ముఖర్జీ. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో దాదాపు 1.35 నిమిషాల నిడివితో ఈ టీజర్‌ను వదిలారు. నా కళ్లు నిన్ను ఎప్పటి నుంచో వెంటాడుతున్నాయి కబీర్. ఇండియాలో బెస్ట్ సోల్జర్, రా లో బెస్ట్ ఏజెంట్‌వి నువ్వే.. కానీ ఇప్పుడు కాదు. నీకు నా గురించి తెలియదు, ఇప్పుడు తెలుసుకుంటావ్. గెట్ రెడీ ఫర్ వార్ అంటూ తారక్ చెప్పిన డైలాగ్స్ పూనకాలు తెప్పిస్తున్నాయి.

Take a Poll

అన్ని భాషల్లోనూ ఎన్టీఆరే డబ్బింగ్

హృతిక్, తారక్ సెపరేట్‌గా చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు.. చివరిలో వీరిద్ధరి మధ్య జరిగే భీకర పోరు ఎలా ఉంటుందో చిన్న టీజర్ వదిలారు. నింగి, నేల, నీరు ఇలా ప్రతీ చోటా వీరిద్దరూ ఎలా తలపడ్డారన్న దానిపై హింట్ ఇచ్చారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. కియారా అద్వానీ తన గ్లామర్‌తో మరోసారి మెస్మరైజ్ చేయనున్నారు. ఆమె హృతిక్‌కు జోడీగా నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజైన ఈ టీజర్‌కు ఎన్టీఆరే డబ్బింగ్ చెప్పడం విశేషం. మొత్తానికి ఎన్టీఆర్‌ను హైలైట్ చేస్తూ ఈ టీజర్ సాగింది. మరి వార్‌ 2లో ఎన్టీఆర్, హృతిక్ ఎలా పోరాడారు? వీరిద్దరూ ఫ్రెండ్సా? ఎందుకు శత్రువులుగా మారారు? అన్నది తెలియాలంటే ఆగస్ట్ 14 వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Read more about: war 2 jr ntr hrithik roshan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X