War 2 Trailer Review: వార్ 2 ట్రైలర్ రివ్యూ.. యాక్షన్‌లో హృతిక్ రోషన్ - ఎన్టీఆర్ హోరాహోరీ

ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై మోస్ట్ అవైటెడ్ మూవీగా గుర్తింపు తెచ్చుకుంది వార్ 2. బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తుండటం పైగా తారక్ తొలి హిందీ చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. తాజాగా ఎన్టీఆర్ హీరోగా అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జూలై 25న వార్ 2 ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ఎలా ఉంది? ఎన్టీఆర్- హృతిక్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు ఎలా ఉన్నాయి? అనేది పరిశీలిస్తే..

వార్ 2 బడ్జెట్ ఎంత?
అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్‌. అషుతోష్ రాణా, అనిల్ కపూర్‌లు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇండియాలోని టాప్ నిర్మాణ సంస్థల్లో ఒకటైన యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్‌‌తో వార్ 2 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వార్ 2 సినిమాకు బెంజమిన్ జాస్పర్ సినిమాటోగ్రాఫర్‌గా, ఆరిఫ్ షేక్‌ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రీతం సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారాలు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్ట్ 14న వార్ 2 గ్రాండ్‌గా విడుదల కానుంది.

War 2 Trailer Review in Telugu Hrithik Roshan and Jr NTR s high voltage performance

తారక్ 25 ఏళ్ల జర్నీ
గతంలో విడుదల చేసిన టీజర్‌లో హృతిక్‌ను హైలైట్ చేయడం ఎన్టీఆర్ అభిమానులను నిరాశ పరిచింది. దీంతో తారక్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేయాలని నిర్మాతలు భావించారు. దీనికి తోడు ఎన్టీఆర్ హీరోగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 25 సంవత్సరాల జర్నీని పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని వార్ 2 ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉంది? అభిమానులను ఆకట్టుకుందో లేదో పరిశీలిస్తే..

ఎన్టీఆర్- హృతిక్ హోరాహోరీ
2 నిమిషాల 35 సెకన్ల నిడివితో విడుదలైన ఈ ట్రైలర్‌ను హృతిక్ రోషన్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభించారు. 'నేను ప్రమాణం చేస్తున్నాను. నేను నా పేరుని, నా గుర్తింపుని, నా ఇంటిని, నా కుటుంబాన్ని అన్నింటిని వదిలేసి ఒక నీడగా మారిపోతాను. ఒక ఊరు పేరు, రూపం లేని నీడగా' అని హృతిక్ చెబుతాడు. ఆ వెంటనే ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో 'నేను మాటిస్తున్నాను.. ఎవ్వరూ చేయలేని పనుల్ని నేను చేసి చూపిస్తాను. ఎవ్వరూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను' అని ఎన్టీఆర్ పాత్ర పవర్ ఫుల్ డైలాగ్ చెబుతుంది.

అంచనాలను పెంచేసిన ట్రైలర్
ఫస్ట్ రిలీజ్ చేసిన టీజర్‌లోని కొన్ని సన్నివేశాలతోనే ఈ ట్రైలర్‌ను కట్ చేసినట్లుగా కనిపిస్తోంది. కాకపోతే తారక్- హృతిక్‌ల మధ్య జరిగే సన్నివేశాలను ఎక్స్‌ట్రాగా యాడ్ చేశారు. స్పై, యాక్షన్, దేశభక్తి చుట్టూ వార్ 2 తిరుగుతుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. హీరోలు ఇద్దరూ సైనికులేనని.. వీరికి గతంలో పరిచయం ఉండేదని, ఏ కారణం చేతనో విడిపోయి బద్ధ శత్రువుల్లా మారుతారని తెలుస్తోంది. కియారా అద్వానీ పెళ్లయినప్పటికీ రొమాంటిక్ సీన్స్‌లో రెచ్చిపోయింది. టూ పీస్ బికినీతో పాటు హృతిక్‌కు లిప్‌లాక్ ఇచ్చి సెగలు రేపింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సీక్వెన్స్‌లు అదిరిపోయాయి. మొత్తం మీద ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లు తమ పర్ఫార్మెన్స్‌తో వార్ 2పై అంచనాలను పెంచేశారు.

More from Filmibeat

Read more about: war 2 hrithik roshan jr ntr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X