ఆ రామారావు ఏంటి.. కృష్ణుడు ఏంటి.. నిన్ను అందరూ దేవుడు అంటున్నారు బావ!
మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి సంబంధించిన ప్రీ రీలీజ్ ఈవెంట్ కనివీని ఎరుగని రీతిలో నిర్వహించారు. సినీ రంగానికి చెందిన ప్రముఖుంలా ఈ వేడుకకు హాజరయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ, మోహన్ బాబు లాంటి ప్రముఖ నటులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆడియో వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎన్టీఆర్ నలుగురు కుమార్తెల చేతుల మీదుగా ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ లాంచ్ జరిగింది. అద్భుతంగా ఉన్న ట్రైలర్ లోని విశేషాలు ఇప్పుడు చూద్దాం.

నలుగురు కుమార్తెల చేతుల మీదుగా
ఎన్టీఆర్ నలుగురు కుమార్తెలు దగ్గుబాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి, ఉమా మహేశ్వరీ, లోకేశ్వరి ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ లాంచ్ చేశారు. తన సోదరీమణుల చేత బాలయ్య దగ్గరుండి ట్రైలర్ లాంచ్ చేయించడం విశేషం. ఎన్టీఆర్ ఆడియో వేడుక చాలా సందడిగా జరిగింది. సినీదిగ్గజాలు కృష్ణ, మోహన్ బాబు, కృష్ణం రాజు ఈ వేడుకకు హాజరు కాడం విశేషం.

రామారావు ఏంటి.. కృష్ణుడు ఏంటి
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ఎన్టీఆర్ ఐకానిక్ గెటప్ శ్రీకృష్ణుడి వేషధారణలో బాలయ్య ఎంట్రీ ఇస్తాడు. బ్యాగ్రౌండ్ లో ప్రకాష్ రాజ్ వాయిస్ వినిపిస్తుంది. ఎన్టీఆర్ ఏంటి.. కృష్ణుడు ఏంటి.. మార్చండి అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. కృష్ణుడిగా ఎన్టీఆర్ చక్కగా సరిపోతాడు. కళ్ళల్లో కొంటెదనం ఉంటుంది అని మరోవ్యక్తి నుంచి ప్రతిస్పందన వస్తుంది.

సినిమాల్లోకి ఎలా
ఎన్టీఆర్ సినిమాల్లోకి ఎలా ప్రవేశించాడు అనే విషయాన్ని కూడా ఈ చిత్రంలో పూర్తి స్థాయిలో చూపించబోతున్నారు. నేను ఉద్యోగం మానేశా.. ఎందుకు మానేశా.. సినిమాల్లోకి వెళతా అంటూ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో జరిగే సంభాషణ ఆకట్టుకునేలా ఉండబోతోంది. విద్యాబాలన్ ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో ఒదిగిపోయి తెలుగింటి గృహిణిగా కనిపిస్తోంది.

ప్రజా జీవితంపై ఆలోచన
ఎన్టీఆర్ కు మనసు ప్రజా జీవితంపై, రాజకీయాలపై మళ్లే సన్నివేశాలని కూడా అద్భుతంగా చూపించబోతున్నారు. జనం కోసమే సినిమాలు చేస్తున్నా. జనం కోసం సినిమా అడ్డం అయితే మానేస్తాను అంటూ బాలయ్య చెబుతున్న డైలాగ్ చాలా బావుంది. 60 ఏళ్ళు వస్తున్నాయి.. ఇన్నాళ్లు మా కోసం బ్రతికాం.. ఇక ప్రజలకోసం ఈ జీవితం అంటూ బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో ఒదిగిపోయి సంభాషణలు పలికిస్తున్నాడు.
అందరూ దేవుడు అంటున్నారు బావ
ఇక బాలయ్య, విధ్యాబాలన్ మధ్య జరిగే సంభాషణ ఈ ట్రైలర్ కే హైలైట్ గా నిలిచింది అని చెప్పొచ్చు. ఇక్కడ అందరూ నిన్ను దేవుడు అంటున్నారు.. అక్కడ నువ్వు కూడా అందరిలాంటి మనిషివి అయిపోతావు బావా అంటూ విద్యాబాలన్ చెప్పే డైలాగ్ అద్భుతంగా ఉంది. తారకం.. నన్ను దేవుణ్ణి చేసిన మనుషుల కోసం మళ్ళీ మనిషిగా మారడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత వచ్చే డైలాగ్ కూడా ఆకట్టుకుంటోంది. ధన బలం అయితే బలుపులో తెలుస్తుంది. కానీ ఇది జనబలం. ఒక్క పిలుపులో వినిపిస్తుంది అంటూ ట్రైలర్ మొత్తం ఆకట్టుకునే డైలాగ్స్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications











