‘సవ్యసాచి’ ట్రైలర్: చావు నిన్ను చేరాలన్నా అతడి ఎడమచేయి దాటాలి!
Recommended Video

అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం "సవ్యసాచి". నాగచైతన్య సరసన బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ ఎగ్జయిటింగ్ థ్రిల్లర్‌కు సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు.
తన రెండు చేతులను సమర్ధవంతంగా వినియోగించగల అర్జునుడిని "సవ్యసాచి" అంటారు. టైటిల్‌కి తగ్గట్లుగానే సినిమా మరియు నాగచైతన్య క్యారెక్టరైజేషన్ ఉండబోతోంది. తనకు తెలియకుండానే అతడి ఎడమ చేతిలో మరో శక్తి ఉంటుంది. తెలుగులో ఇప్పటి వరకు రాని సరికొత్త కాన్సెప్టుతో ఈ చిత్రం రాబోతోంది.

నాగ చైతన్య పాత్రలో రెండు షేడ్స్
ప్రేమ, కోపం లాంటి ఎమోషన్స్ మీకొస్తే మీరు మాత్రమే రియాక్ట్ అవుతారు, అదే నాకొస్తే.. ఇంకొకడు కూడా రియాక్ట్ అవుతాడు. అదే నా ఎడమచేయి.... అని చైతన్య చెప్పే డైలాగును బట్టి అతడి ఎడమ చేయిలో మరో పాత్ర ఉందని అర్థం చేసుకోవచ్చు. విక్రమ్, ఆదిత్య అనే రెండు షేడ్స్‌లో నాగ చైతన్య పాత్ర కనిపించబోతోంది. చావు కూడా నిన్ను చేరాలంటే అతడి ఎడమ చేయి దాటి రావాలి అనే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

విలన్ పాత్రలో మాధవ్
ఈ చిత్రంలో మరో హైలెట్ ప్రముఖ నటుడు మాధవన్ విలన్ పాత్రలో నటిస్తుండటం. సినిమాలో మాధవన్, నాగ చైతన్య మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. భూమిక మరో ముఖ్య పాత్రలో కనిపించబోతోంది.
మైత్రి మూవీస్
‘సవ్యాసాచి' చిత్రం శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి హిట్ చిత్రాలు అందించిన ‘మైత్రి మూవీ మేకర్స్' నుంచి వస్తుండటంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

సవ్యాసాచి
నాగచైతన్య అక్కినేని, నిధి అగర్వాల్, మాధవన్, రావురమేష్, వెన్నెల కిషోర్, సత్య, తాగుబోతు రమేష్ లు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, సినిమాటోగ్రఫీ: యువరాజ్, కళ: రామకృష్ణ, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, పోరాటాలు: రామ్-లక్ష్మణ్, కో-డైరెక్టర్: చలసాని రామారావు, సి.ఈ.ఓ: చిరంజీవి (చెర్రీ), లైన్ ప్రొడ్యూసర్: పిటి.గిరిధర్, నిర్మాతలు: వై.నవీన్-వై.రవిశంకర్-మోహన్ (CVM), కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: చందూ మొండేటి.


Click it and Unblock the Notifications











