Vijay Devarakonda- Rashmika Mandanna: రష్మికతో పెళ్లి.. విజయ్ దేవరకొండ ఫస్ట్ రియాక్షన్

టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లుగా గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వివాహ వేదిక, ముహూర్తం, అతిథులు, వెడ్డింగ్ కార్డ్ ఇలా సమస్తం నెట్టింట చక్కర్లు కొడుతున్నా.. విజయ్, రష్మికలు ఏమాత్రం రియాక్ట్ కాలేదు. అలాగని ఈ వార్తలకు కూడా ఎక్కడా చెక్ పడటం లేదు. నిత్యం వీరిద్దరిపై ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. తాజాగా విజయ్ దేవరకొండ స్పందించారు. ఈ వివరాల్లోకి వెళితే..

విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నలు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు రావడం ఇప్పటిది కాదు.. గీత గోవిందం సినిమాలో తొలిసారిగా విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ టైంలోనే వీరిద్దరి మధ్య స్నేహం మొదలై, ప్రేమగా మారిందని నాడే గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఈ జంట సీక్రెట్‌గా డేట్స్, పార్టీలు, విహారయాత్రలకు వెళ్లేవారు. వీరిద్దరూ వేర్వేరుగా ఫోటోలు షేర్ చేసినా.. ఆ ప్రదేశాలు, ఫోటోల బ్యాక్‌గ్రౌండ్స్ అన్ని సేమ్ టూ సేమ్ ఉండటంతో మీడియాకి, అభిమానులకు అనుమానాలు మొదలయ్యాయి.

Wedding of Virosh Vijay Deverakonda and Rashmika Mandanna officially confirmed their wedding

నాటి నుంచి విజయ్, రష్మికలపై మీడియా నిఘా మరింత ఎక్కువైంది. పలుమార్లు ఎయిర్‌పోర్ట్స్, రెస్టారెంట్స్‌లో క్లోజ్‌గా ఉన్న ఫోటోలు బయటికొచ్చాయి. అయినప్పటికీ తమ మధ్య ఉన్న బంధం ఇదీ అని ఏనాడూ విజయ్ కానీ, రష్మిక కానీ బహిర్గతం చేయలేదు. పలు ఇంటర్వ్యూలు, ఈవెంట్స్‌లలో యాంకర్లు ఈ విషయాన్ని బయటకు లాగాలని చూసినా విజయ్ - రష్మికలు ఏమాత్రం బయటపడేవారు కాదు. ఓ చిన్న నవ్వు నవ్వి తెలివిగా తప్పించుకునేవారు.

ఈ దశలో గతేడాది అక్టోబర్‌లో ఈ జంట సీక్రెట్‌గా నిశ్చితార్ధం చేసుకుందని వార్తలు రావడంతో చిత్ర పరిశ్రమ, అభిమానులు షాక్ అయ్యారు. ఇంత జరుగుతున్నా అప్పుడు కూడా విజయ్- రష్మికలు అధికారికంగా తమ బంధాన్ని బయటపెట్టలేదు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో విజయ్- రష్మికల పెళ్లి, ఆ తర్వాత మార్చి 6న హైదరాబాద్‌లో గ్రాడ్ రిసెప్షన్ జరుగుతుందని మీడియాలో కథనాలు వచ్చాయి. తీరా ఈ డేట్‌కి సమయం దగ్గరపడటంతో మీడియాలో హడావుడి మొదలైంది. విజయ్ ఇంటికి విద్యుత్ దీపాలు, అందంగా ముస్తాబు చేయడం, తాటాకు పందిర్లు ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయి. ఇంతలో వెడ్డింగ్ కార్డ్ కూడా బయటకు వచ్చేయగా... విజయ్- రష్మికలు ఇక విషయాన్ని దాచలేరని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీనికి తగినట్లుగానే విజయ్ దేవరకొండ, రష్మికలు స్పందించారు. అధికారికంగా తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.

మేం ఏదైనా ప్లాన్ చేసుకుందామని అనుకున్నా.. ఏదైనా సెలెక్ట్ చేసుకుందామని అనుకున్నా.. ముందుగా మీరే ఆ పనులు చేసి పెడుతుంటారు. ఇప్పుడు కూడా పెళ్లి విషయంలో చాలా ప్రేమగా ఓ పేరు పెట్టారు. మా ఇద్దరినీ విరోష్ అని పిలుస్తున్నారు. అందుకే అభిమానుల ప్రేమకు గుర్తుగా వారు పెట్టిన విరోష్‌ను స్వాగతిస్తూ వారిని గౌరవిస్తున్నాం. మా పెళ్లి వేడుకకు వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని నామకరణం చేయాలనుకుంటున్నాం. మాపై ఇంత ప్రేమను చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. మీరెప్పుడు మా కుటుంబంలో భాగం ' అని విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇదే పోస్ట్‌ను అటు రష్మిక మందన్న కూడా పోస్ట్ చేశారు. ఈ ప్రకటనతో ఇన్నిరోజులుగా విజయ్- రష్మికల రిలేషన్, పెళ్లిపై వస్తున్న ఊహాగానాలకు, గందరగోళానికి చెక్‌పడినట్లయ్యింది. దాంతో ఇప్పుడు అందరిచూపు ఫిబ్రవరి 26వ తేదీపై పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X