ఓవర్సీస్‌లో దుమ్ముదులిపిన ‘మేజర్’: రికార్డు స్థాయి ధరకు అమ్ముడైన బయోపిక్

విభిన్నమైన చిత్రాలతో విలక్షణ హీరోగా పేరు తెచ్చుకున్నాడు యంగ్ టాలెంటెడ్ స్టార్ అడవి శేష్. ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతోన్న అతడు.. ప్రస్తుతం శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 'మేజర్' అనే సినిమాను చేస్తున్నాడు. ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ఊహించని ధరకు అమ్ముడు పోయినట్లు ఓ న్యూస్ లీకైంది.

వరుస విజయాలతో దూసుకుపోతోన్న అడవి శేష్ నటిస్తోన్న తాజా చిత్రం 'మేజర్'. ఈ సినిమా టీజర్ విడుదలైన తర్వాత దీనిపై ఉన్న అంచనాలు అమాంతం రెట్టింపు అయ్యాయి. దీంతో ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ హక్కుల కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్‌ డీల్‌ క్లోజ్ అయినట్లు తెలిసింది. ఈ హక్కులను వీకెండ్ సినిమా, సౌతర్న్ స్టార్ సంస్థలు సంయుక్తంగా సొంతం చేసుకున్నాయి. ఇందుకోసం చిత్ర యూనిట్‌కు భారీ మొత్తాన్ని ముట్ట చెప్పినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

Weekend Cinema US and Southern Star bagged Adivi Sesh Major Movie Overseas Rights

వాస్తవానికి 'మేజర్' సినిమాను జూలై 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, కరోనా ప్రభావంతో ఈ సినిమాను వాయిదా వేసేశారు. ఈ విషయాన్ని కూడా ఇటీవలే వెల్లడించారు. ఇక, భారీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్, టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు నిర్మాణ సంస్థ జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శోభిత దూళిపాళ్ల కీలక పాత్రను చేస్తోంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X