twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొత్త కాన్సెప్ట్‌తో వెల్‌కం జింద‌గీ.. ఫ‌స్ట్‌లుక్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

    |

    శ్రీ‌నివాస క‌ళ్యాణ్, పోద్దార్‌ల‌ను హీరో, హీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తూ నూత‌న నిర్మాణ సంస్థ పిల్ల‌ర్ 9 ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తున్న‌ మొద‌టి సినిమా వెల్‌కం జిందగీ. ఈ ఫీల్‌గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ మూవీకి శాలు- ల‌క్ష్మ‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మన చుట్టూ ఉన్న‌ ప‌దిమందికి అందించే సాయం వారి జీవితాల్లో వెలుగులు నింపితే ఆ ఆనంద‌మే వేరు అనే పాయింట్‌తో ఈ సినిమా రూపొందింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర ప‌నుల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ ,మోష‌న్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు.

    ద‌ర్శ‌కులు శాలు- ల‌క్ష్మ‌ణ్‌ మాట్లాడుతూ.. మ‌నం చేసే చిన్న సాయం ఇత‌రుల జీవితాల్లో ఎలాంటి ఆనందాన్ని, వెలుగును నింపుతుందో చెబుతూ సహాయం ప్రాముఖ్య‌త‌ను వివ‌రించే చిత్ర‌మే ఇది. ఫ్యామిలీ డ్రామాతో పాటు ప్రేమ‌క‌థ ఆక‌ట్టుకుంటుంది. ఇదో ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌. కొత్త‌వారే అయినా నాయ‌కానాయిక‌లు చ‌క్క‌గా న‌టించారు.

    Welcom Zindagi movie poster, First look released

    మ‌ధుమ‌ణి, క‌మ‌ల్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లు పోషించారు. వారి న‌ట‌న సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. జ‌బ‌ర్ధ‌స్త్ ఫేం కొమురం హీరో స్నేహితుడిగా న‌టించాడు. త‌న కామెడీ ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బా న‌వ్విస్తుంది. సినిమాటోగ్రాఫ‌ర్ శ్రీ‌సాయి ప్ర‌తి ఫ్రేమ్‌ను అందంగా తెర‌కెక్కించారు. 5 విభిన్న‌మైన‌ పాట‌లున్నాయి. గౌత‌మ్ ర‌విరామ్ సంగీతం అద్భుతంగా కుదిరింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర ప‌నులు చివ‌రి ద‌శ‌లో ఉన్నాయి. తాజాగా ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేశాం అని శాలు, ల‌క్ష్మ‌ణ్ అన్నారు.

    English summary
    Welcom Zindagi a different concept movie. news faces are going to give magic performances. Srinivas Kalyan, Poddar are lead pair. Shalu, Lakshman are the director.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X