‘ఇంకొకడిని తగులుకుని రోజూ అదే పని... నా భార్య వల్ల జీవితం నాశనం’
రంగస్థలం ఫేమ్ మహేష్ ఆచంట సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటాడు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన ఈయన.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ వీడియో మార్నింగ్ నుంచి ట్రెండింగ్‌లో ఉంది. ఏ వివాదం లేనప్పటికీ .. మహేశ్ ఇలాంటి వీడియోను పోస్ట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వెంటనే ఓ ఛానెల్‌లో తన భార్యతో గొడవపడుతున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
జీవితం ఎవ్వరూ ఊహించనది.. ఎప్పుడు ఎవరి జీవితంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు, మనం బయట జరిగేవాటిని చూసి ఏవేవో ఊహించుకుని నమ్మొద్దు. నేను నోరు తెరిచి నిజం చెప్పే వరకు మీరు అనుకుంటున్నది ఊహించి రాయొద్దని మీడియా, మీమర్స్‌కు విజ్ఞప్తి చేశారు. త్వరలోనే నేనే అంతా చెబుతానని మహేశ్ చెప్పడంతో ఆయనకు ఏం జరిగింది? ఏం చెప్పాలని అనుకుంటున్నాడు? అతని గురించి సోషల్ మీడియాలో కానీ, వార్తల్లో కానీ ఎలాంటి మీమ్స్ రాలేదు. అలాంటప్పుడు మహేశ్ ఎందుకు అంత సీరియస్ అయ్యాడంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

కట్ చేస్తే ఓ ఛానెల్‌లో ప్రముఖ సైకియాట్రిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి సమక్షంలో జరిగిన డిస్కషన్‌లో మహేశ్ తన భార్యతో గొడవ పడుతున్నట్లుగా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఏకంగా ఇద్దరూ చెప్పు చూపిస్తూ ఒకరికొకరు కొట్టుకునేలా వాతావరణం హాట్ హాట్‌గా ఉంది. దీని వల్ల నా జీవితం నాశనమైపోయింది సార్ అని మహేశ్ కంటతడి పెడతాడు. అసలు ఇంత సిగ్గులేని పని ఎలా చేశావని డాక్టర్ అడుగుతాడు. ఒక మంచోడిని మోసం చేశానన్న బాధ కూడా లేదు సార్ దీనికి అని మహేశ్ ఫైర్ అవ్వగా.. సుఖపెట్టలేని మంచితనంతో కాపురం చేయాలా? అని భార్య ప్రశ్నిస్తుంది. దానికి కోప్పడిన మహేశ్ చెప్పు తీసుకుని కొడతానంటూ కోప్పడతాడు.
ఇదంతా చూసిన కళ్యాణ్ చక్రవర్తి మీరు ఇలా కొట్లాడుకునేట్లు అయితే ఇక్కడి వరకు ఎందుకొచ్చారు? అసలు ఏం చేసిందో వివరంగా చెప్పండి అని యాంకర్ ప్రశ్నించారు. పెళ్లయిన కొత్తలో బాగానే ఉండేది, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తానంది, మన బతుక్కి అవసరమా అని అడిగా? సర్లే చేస్తానంది చేయనిచ్చాను. అక్కడిదాకా బాగానే ఉంది... ఈరోజు ఎవరినో తగులుకుంది. వాడితో రోజూ వీడియో కాల్స్.. ఇలాంటి దరిద్రమైన పరిస్ధితి ఏ మొగుడికి రావొద్దు. ఒక కామన్‌మెన్ తనకొచ్చే జీతంలో హ్యాపీగా బతకాలని అనుకోవడం తప్పా? నాకొచ్చే జీతంతో మొత్తం నెలంతా తినొచ్చు, రెండు సార్లు సినిమాకు వెళ్లొచ్చు, ఒకసారి షాపింగ్‌కి వెళ్లొచ్చు అది సరిపోదా సార్ అంటూ మహేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇవన్నీ చేతకాని వాళ్లు చెప్పే విషయాలనీ భార్య కౌంటర్ ఇవ్వడంతో మహేశ్ కోపంతో ఊగిపోతూ చెప్పు తీసుకుని కొడతానంటూ ఆమె మీదకి వెళ్లాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అసలు మహేశ్, అతని భార్యకు మధ్య ఏం జరిగింది? ఈ స్థాయిలో గొడవలు జరగడానికి కారణం ఏంటీ? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇదంతా నిజం కాదు. ప్రముఖ తెలుగు ఓటీటీ యాప్ ఛాయ్ షాట్స్ రూపొందించిన ఢీ ఫర్ డివోర్స్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం చేసిన వీడియో. ఈ ప్రోమో చివరిలోనే వీరిద్దరి కథ గురించి తెలుసుకోవాలంటే వెంటనే ఛాయ్ షాట్స్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోమంటూ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి చెబుతూ సర్‌ప్రైజ్ ఇచ్చారు. దాంతో నెటిజన్లు ఈ ప్రమోషనల్ వీడియోపై రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications


