Hanuman: హనుమాన్ విషయంలో నిర్మాత మాట తప్పారా?.. ప్రశాంత్ వర్మ ప్లానింగ్ ఏమైనట్టు?
సినిమాకి ఎల్లలు అంటూ ఎలాంటివి లేవు. ఏ జానర్ లో అయినా సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా వస్తూనే ఉంటాయి. అలా ఉన్న కొన్ని సెన్సేషనల్ జానర్స్ లో సూపర్ హీరో జానర్ కూడా ఒకటి. హాలీవుడ్ లో ఎప్పుడు నుంచో ఈ జానర్ సినిమాలు ఉన్నాయి కానీ మన ఇండియాలో మాత్రం చాలా తక్కువే అని చెప్పాలి.
మెయిన్ గా సరైన కథ ఒకటి ముఖ్యం కాగా దీనితో పాటుగా ఈ తరహా సినిమాలకి బడ్జెట్ సమస్యలు కూడా చాలానే ఉంటాయి. ఎక్కువ సిజి పనులు టెక్నీకల్ గా చాలా తతంగం ఉంటుంది అందుకే మన వాళ్ళు ఎక్కువ టచ్ చెయ్యలేదు. కాగా ఈ సమయంలో మన తెలుగు సినిమా నుంచి మొట్ట మొదటి సూపర్ హీరో సినిమా వచ్చింది.

అదే "హను మాన్". తెలుగు దర్శకులు వండర్స్ సెట్ చేస్తున్న తరుణంలో యంగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాని యువ హీరో తేజ సజ్జతో చేసి చాలా నమ్మకంగా గట్టి పోటీలో రిలీజ్ కి వచ్చాడు. రిలీజ్ కి ముందు చాలా స్ట్రగుల్స్ పడ్డారు కానీ ఒక్కసారి టీజర్ బయటకి వచ్చాక అసలు ఇది మన తెలుగు సినిమానేనా అనే రేంజ్ లో ప్రశంసలు వచ్చాయి.
దీనితో భారీ హైప్ ని అందుకున్న ఈ సినిమాని మేకర్స్ ఈ 2024లో సంక్రాంతికి తీసుకొచ్చారు. కాగా సీన్ కట్ చేస్తే ఇప్పుడు వరకు హనుమాన్ నే ఈ ఏడాది బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఆ రేంజ్ లో సెన్సేషన్ ని సెట్ చేసిన సినిమాని పాన్ ఇండియా భాషలతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రశాంత్ వర్మ కన్ఫర్మ్ చేసాడు.

అయితే ఏకకాలంలో ఈ రిలీజ్ కాలేదు కానీ ఇండియాలో రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యాక ప్రశాంత్ వర్మ గ్లోబల్ గా మిగతా భాషల్లో విడుదల చేస్తానని తెలిపాడు. కానీ ఇప్పటికీ దీనిపై ఎలాంటి ప్రోగ్రెస్ కనిపించడం లేదు. చైనీస్, జాపనీస్, కొరియా సహా ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో కూడా అందులో 3డి లో కూడా విడుదల చేస్తామని తెలిపాడు. కానీ ఇప్పుడు ఈ సినిమా ఈ అన్ని వెర్షన్ ల రిలీజ్ ఏమైందో వారికే తెలియాలి.
ఇప్పుడు ప్రశాంత్ వర్మ పలు హనుమాన్ సీక్వెల్ "జై హనుమాన్" సహా మరో సినిమాలో కూడా బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి అసలు హనుమాన్ గ్లోబల్ రిలీజ్ ఉంటుందో లేదో చూడాలి. కాగా ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా గెటప్ శ్రీను, సముద్రఖని, వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు నటించారు. అలాగే నిరంజన్ రెడ్డి నిర్మాణం వహించారు.


Click it and Unblock the Notifications











