జానీ మాస్టర్‌కు ఎన్నేళ్ల జైలు శిక్ష ? రేప్ కేసులో ఆరోపణలు రుజువైతే ఏం జరుగుతుందంటే?

ఇండియన్ టాప్ డ్యాన్స్ డైరెక్టర్ జానీ మాస్టర్ తన కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తనపై నమోదైన అతాచార్యం, లైంగిక దాడి కేసు నుంచి ఎలా బయటపడుతారనే విషయం ఆసక్తికరంగా మారింది. జానీ మాస్టర్ ప్రస్తుత పరిస్థితిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ కేసులో ఆరోపణలు రుజువైతే జానీ మాస్టర్‌కు ఎలాంటి శిక్ష పడుతుంది అనే విషయంపై న్యాయ నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

జానీ మాస్టర్‌పై ఆయన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసే యువతి తీవ్రమైన ఆరోపణలతో కేసు నమోదు చేశారు. తాను మైనర్‌గా ఉన్నప్పుడే 16 ఏళ్ల వయసులో ముంబైలోని ఓ హోటల్‌లో బలత్కారం చేశారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో లైంగిక దాడి జరిపారనే ఆరోపణలపై ఆయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు.

What is the punishment for Jani Master in POCSO case filed Rape allegations by Victim

బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌పై ఐపీసీ చట్టం కింద పలు కేసులు నమోదు చేశారు. తొలుత రాయదుర్ఘం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ తర్వాత సంబంధిత నార్సింగి పోలీస్ స్టేషన్‌కు కేసు బదిలి చేశారు. దాంతో ఆయనపై సెక్షన్ 376 (రేప్), నేరపూరితంగా బెదిరింపులు ( సెక్షన్ 506), ఉద్దేశపూర్వకంగా గాయపరచడం (323 సెక్షన్ (2) (N)) కింద కేసు నమోదు చేశారు.

బాధితురాలి నుంచి వాగ్మూలం సేకరించిన తర్వాత జానీ మాస్టర్‌ అరెస్ట్‌కు రంగం సిద్దం చేశారు. కర్ణాటక, గోవా సరిహద్దు ప్రాంతంలో ఆయనను అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్‌లో విచారించిన తర్వాత రాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పరపల్లి కోర్టులో హాజరు పరిచారు. దాంతో ఆయనను 14 రోజు రిమాండ్‌కు తరలిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దాంతో ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు.

అయితే ఈ కేసులో జానీ మాస్టర్‌పై వచ్చిన అభియోగాలు, ఆరోపణలు రుజువైతే శిక్ష ఏమిటి? ఆయన కెరీర్ ఎలా ఉంటుందనే వివరాలపై న్యాయ నిపుణులు అనేక విధాలుగా తమ అభిప్రాయాలను చెబుతున్నారు. బాధితురాలు సాక్ష్యాలు సమర్పిస్తే.. ఆయన కెరీర్ క్లోజ్ అనే విషయాలను వెల్లడిస్తున్నారు.

What is the punishment for Jani Master in POCSO case filed Rape allegations by Victim

న్యాయ నిపుణులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈ కేసులో బాధితురాలు తాను చేసిన ఆరోపణలు రుజువైతే.. సినిమా పరిశ్రమలో నిషేధం వేటు పడుతుంది. దాంతో కెరీర్ క్లోజ్ అవుతుంది. ఇక ఈ కేసులో జానీ మాస్టర్‌పై మోపిన అభియోగాలు రుజువైతే జీవితకాలపు శిక్ష పడుతుంది. కనీసం 7 ఏళ్లపాటు శిక్ష అమలు అవుతుందని పేర్కొంటున్నారు. ఈ కేసులో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Read more about: jani master rape case
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X