twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లాక్‌డౌన్‌లో రవితేజ ఆ మూడు పనులు.. ఏం చేస్తున్నారంటే

    |

    కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో కలిసి వచ్చిన సమయాన్ని సినీ తారలు పలు రకాలుగా ఉపయోగించుకొంటున్నారు. సాధారణంగా రవితేజ్ పార్టీలకు, సోషల్ ఈవెంట్లకు దూరంగా ఉంటారనేది సినీ వర్గాల్లో టాక్. షూటింగ్ లేకుంటే ఆయన ఇంట్లోనే ఫ్యామిలీతోనే గడపడం, లేదా జిమ్‌లో కసరత్తులు చేయడం చేస్తుంటారని సన్నిహితులు చెప్పుకొంటారు. ఎప్పుడూ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టే మాస్ మహారాజ్ రవితేజ మాత్రం ప్రస్తుతం బుద్దిపుట్టినప్పుడల్లా జిమ్‌లో గడుపుతున్నారట. లాక్‌డౌన్ కారణంగా చాలా సమయం ఇంట్లోనే గడిపే అవకాశం రావడంతో అదృష్టంగా భావిస్తున్నారట.

    రవితేజ గురించి ఆయన సన్నిహితులు మాట్లాడుతూ.. షూటింగ్ ఉన్నా లేకున్నా ఆయన జిమ్‌లోనో లేదా సినిమాలు చూస్తూ సమయాన్ని ఎంజాయ్ చేస్తారు. లాక్‌డౌన్‌లో కూడా అదే చేస్తున్నారు. అంతేకాకుండా వీలైనంత సేపు ఫ్యామిలీకే సమయాన్ని కేటాయిస్తున్నారు అని అన్నారు.

    What Ravi Teja doing in Corona Lockdown

    స్వీయ గృహ నిర్బంధాన్ని పాటిస్తున్న రవితేజ ఇటీవల ఓ ఫోటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చూసి.. ఇంటి పట్టునే ఉండండి. సురక్షితంగా ఉంటూ.. ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టండి అంటూ ఓ సందేశాన్ని అభిమానులకు ఇచ్చారు.

    ఇటీవల తన తాజా చిత్రం క్రాక్ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్‌ను శ్రీరామ నవమి సందర్బంగా షేర్ చేయగా మంచి రెస్పాన్స్ లభించింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది.

    ఇటీవల కాలంలో రవితేజ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సత్పలితాలు ఇవ్వకపోవడం ఫ్యాన్స్‌కు నిరాశను కలిగించింది. ఇటీవల ఆయన నటించిన డిస్కో రాజా సినిమా ప్రేక్షకులకు నిరాశనే మిగిల్చింది. అయితే ఈ సారి క్రాక్ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకొనేందుకు రవితేజ ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రంలో శృతి హాసన్ మరోసారి జతకట్టింది.

    English summary
    Mass Maharaja Ravi Teja is enjoying Corona Lockdown period. He is concentrating on fitness. He share a picture in his instagram and said that Stay home stay safe stay fit!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X