టెనెట్ ట్రైలర్ ప్రకంపనలు.. అమితాబ్ అయోమయం.. అసలేం జరిగిందంటే
బ్రిటన్, అమెరికన్ ఫిల్మ్ మేకర్ క్రిస్టఫర్ నోలన్ రూపొందించిన టెనెట్ మూవీ బాలీవుడ్‌లో ప్రకంపనాలు సృష్టిస్తున్నది. ఈ చిత్రంపై బాలీవుడ్ ప్రముఖులే కాకుండా ఇతర భాషల నటులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. తాజాగా టెనెట్ ట్రైలర్ రిలీజై అనూహ్యమైన స్పందనను కూడగట్టుకొంటున్నది. గులాబో సితాబో దర్శకుడు సుజోయ్ ఘోష్ టెనెట్ ట్రైలర్‌ను చూసి ఎక్సైట్ అయ్యారు. అయితే అందరూ టెనెట్ ట్రైలర్ గురించి మాట్లాడుతుంటే బిగ్ బీ అమితాబ్ మాత్రం అయోమయంలో పడిపోయాడు. ఇంతకు బిగ్ బీ అయోమయానికి కారణమేమిటంటే..

టెనెట్ అంటే ఏమిటి?
టెనెట్ మూవీ ట్రైలర్, గులాబో సితాబో గురించి దర్శకుడు సుజోయ్ ఘోష్ స్పందిస్తూ.. నిన్న టెనెట్.. నడు గులాబో సితాబో అంటూ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌కు బిగ్ బీ స్పందిస్తూ.. ఇంతకీ టెనెట్ ఏమిటి అంటూ ప్రశ్నిస్తే.. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రమది. ఆఫీషియల్‌గా రిలీజ్ అయితే తప్ప మనం చూడలేం అంటూ ట్వీట్లు చేశారు.
నోలాన్ సర్ సినిమా ఇది..
ఇలా బిగ్‌బీ సంభాషణ కొనసాగిస్తూ సుజయ్ ఘోష్‌కు మరో ఝలక్ ఇచ్చారు. నా సినిమా కూడా టెనెట్ లాంటిదే. కానీ నాకు ఫైనల్‌గా మూవీని చూపించలేదు అని అడిగితే.. త్వరలోనే గులాబో సితాబో సినిమా చూపిస్తానని సుజయ్ ఘోష్ వెల్లడించారు. అలాగే టెనెట్ అంటే నోలాన్ సర్ రూపొందించిన తదుపరి చిత్రం అని ఓ నెటిజన్ సమాధానం ఇచ్చారు.

నెటిజన్ల పోటీపడి సమాధానాలు
అమితాబ్ అడిగిన టెనెట్ అంటే ఏమిటి? అనే ప్రశ్నకు నెటిజన్లు పోటీ పడి సమాధానం ఇచ్చారు. ఒకరు ట్రైలర్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసి ఇదే సినిమా అంటే.. మరొకరు టెనెట్ అంటే ఓ నమ్మకం అంటూ ట్రాన్స్ లేషన్ చేసి ఆ సినిమా గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
Recommended Video
టెనెట్ ట్రైలర్‌కు అనూహ్య స్పందన
ఇక మే 21వ తేదీన రిలీజైన టెనెట్ ట్రైలర్‌కు అనూహ్య స్పందన లభిస్తున్నది. ఈ చిత్రంలో జాన్ డేవిడ్ వాషింగ్టన్, రాబర్ట్ పాటిన్సన్, ఎలిజబెత్ దెబికి, క్లెమెన్సే పోసీ, ఆరానో టైలర్ జాన్సన్; మైఖేల్ కైనే, కెన్నెత్ బ్రనగ్, అలాగే డింపుల్ కపాడియా కూడా ఓ కీలక పాత్రను పోషించింది.


Click it and Unblock the Notifications











