అఖండ 2 మూవీ రిలీజ్ ఎప్పుడు? బాలయ్య సినిమా విడుదల వారి చేతుల్లోనేనా?
అఖండ 2 చిత్రం విడుదల నిరవధికంగా ఆగిపోవడంతో నందమూరి అభిమానులు, సినిమా ప్రేక్షకుల దిగ్బ్రాంతికి గురయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర హీరో, 50 ఏళ్ల నట జీవితం ఉన్న నందమూరి బాలకృష్ణ మూవీ రిలీజ్ ఆగిపోవడం సినీ వర్గాలకు జీర్ణించుకోలేని విషయంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్ల వద్ద నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడూ ఈ సినిమా విడుదల అవుతుందా? అనే పడిగాపులు పడుతున్నారు. దాంతో ఈ సినిమా రిలీజ్ అవుతుందా? అయితే ఎప్పుడు? అనే ప్రశ్నలు అభిమానుల నుంచి ఎదురవుతున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో చాలా విషయాలకు జవాబులు లేకుండానే ఉన్నాయనే వాదన ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్నది. ఈ సినిమా రిలీజ్ గురించిన విషయాల్లోకి వెళితే..
అఖండ 2 నిర్మాతలు తాము చెల్లించాల్సిన ఫైనాన్స్ అంశం వివాదంగా మారింది. ఎరోస్ సంస్థ తమకు చెల్లించాల్సిన కోట్లాది రూపాయలు చెల్లిస్తే గానీ ఈ సినిమా రిలీజ్‌కు అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు మద్రాస్ హై కోర్టు ఆదేశాలతో ఈ సినిమా రిలీజ్ నిరవధికంగా వాయిదా పడటం తెలుగు సినిమా పరిశ్రమలో చేదు సంఘటనగా మారింది.

అయితే అఖండ 2 సినిమా రిలీజ్ కాకపోవడంపై బాలయ్య తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఫైనాన్స్ వివాదాలను త్వరగా పరిష్కరించుకొని మూవీని వెంటనే విడుదల చేయాలని నిర్మాతలకు హెచ్చరిక చేసినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు దర్శకుడు బోయపాటి శ్రీనుతో బాలయ్య వ్యక్తిగతంగానే కాకుండా పలు దఫాలు ఈ సినిమా రిలీజ్ గురించి, వివాదం గురించి పరిష్కరించినట్టు తెలుస్తున్నది.
అయితే ఒకవేళ అఖండ నిర్మాతలు ఫైనాన్స్ క్లియర్ చేసినట్టయితే వచ్చే వారం రిలీజ్ అవుతుందని కొందరు.. ఈ సినిమా రిలీజ్‌కు సరైన స్లాట్ లేకపోవడం వల్ల వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమాను రిలీజ్ చ చేస్తారని వార్తలు మీడియాలోను, సోషల్ మీడియాలోను షికారు చేస్తున్నాయి. అయితే నిర్మాతలు బహిరంగ ప్రకటన చేస్తే గానీ ఈ సినిమా రిలీజ్ ఎప్పుడో క్లారిటీ వచ్చే అవకాశమే లేదని సినీ వర్గాలు అంటున్నాయి.
ఇదిలా ఉండగా, ఓవర్సీస్‌లో ఈ సినిమా విడుదల ఎప్పుడు ఉంటుందనే విషయంపై క్లారిటీ ఇవ్వలేమని డిస్టిబ్యూటర్లు చెబుతున్నట్టు సమాచారం. వెంటనే ఈ సినిమా షోలు నార్త్ అమెరికాలో వెంటనే వేయలేమని కూడా చెబుతున్నట్టు తెలుస్తున్నది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ మాత్రం ఓటీటీ సంస్థ చేతిలోనే ఉంది. నెట్‌ఫ్లిక్స్ ఇచ్చే ఆదేశాల ప్రకారమే ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అవుతుంది. ఫైనాన్స్ గొడవలు క్లియర్ కాకపోతే ఓటీటీ కూడా తీవ్రమైన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











