టాప్ దర్శకుడిని కత్తితో బెదిరించిన బాలకృష్ణ..

ఇప్పుడు తెలుగు సినిమా పవర్ పాన ఇండియా లెవెల్లో ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాలిన పని లేదు. సీనియర్ దర్శకులు నుంచి ఇప్పుడిప్పుడే వస్తున్నా యంగ్ దర్శకులు కూడా తమ సత్తా చాటుతూ అదరగొడుతున్నారు. కాగా పాన్ ఇండియా సినిమా ఎంట్రీ ఇవ్వడంతోనే సక్సెస్ అయ్యిన దర్శకుల్లో అయితే మొదటిగా ఎస్ ఎస్ రాజమౌళి పేరే వినిపిస్తుంది.

కాగా తన తర్వాత తెలుగు నుంచి సక్సెస్ అయ్యిన సీనియర్ దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది టాలీవుడ్ మోస్ట్ క్రియేటివ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు సుకుమార్ అనే చెప్పాలి. కాగా సుకుమార్ పుష్ప 1 తో పాన్ ఇండియా దర్శకుడు కాగా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో పుష్ప 2 తో ఏకంగా 1000 కోట్ల దర్శకుడిగా మారబోతున్నాడు. అయితే సుకుమార్ తో చాలా మందికి ఉంటుంది.

when balayya warned pushpa 2 director with knife in movie sets

కానీ అది కొందరికే దక్కుతుంది. అయితే మన తెలుగు సినిమాకి చెందిన సీనియర్ మాస్ హీరో ఒకరు ఏకంగా పుష్ప 2 సెట్స్ కి కత్తి తీసుకొని వెళ్లి మరీ నాతో ఎప్పుడు సినిమా చేస్తావ్ అని వార్నింగ్ ఇచ్చారట. ఇది నిజమే ఈ విషయాన్ని స్వయంగా ఆ హీరోనే చెప్పుకొచ్చారు. కాగా ఆ హీరో మరెవరో కూడా కాదు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణే.. కాగా ఈ షాకింగ్ విషయాన్ని తాజాగా బాలయ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెల్లడించారు.

అయితే అది సీరియస్ వార్నింగ్ కాదు కానీ గతంలో సుకుమార్ తన ఓటిటి టాక్ షో అన్ స్టాప్పబుల్ కి వచ్చినపుడు నేను ఓకే అంటే 3 నెలల్లో సినిమా చేస్తాను అని మాట ఇచ్చాడు. ఆ మాటనే కత్తి పట్టుకొని పుష్ప 2 సెట్స్ లోకి వెళ్లే సుకుమార్ ని నాతో మూడు నెలల్లో సినిమా చేస్తానని మాట ఇచ్చావ్ ఎప్పుడు అని అడిగానని బాలయ్య తెలిపారు. దీనితో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

when balayya warned pushpa 2 director with knife in movie sets

మరి సుకుమార్ బాలయ్యతో నార్మల్ గానే అన్నారో ఏమో కానీ బాలయ్య మాత్రం ఈ మాటలు సీరియస్ గా తీసుకున్నారని చెప్పాలి. మరి ఈ మ్యాడ్ కాంబినేషన్ నుంచి సినిమా ఉంటుందో లేదో కాలమే డిసైడ్ చేయాలి. ప్రస్తుతం అయితే సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప 2 లో బిజీగా ఉన్నారు. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా ఈ ఏడాది డిసెంబర్ 6న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

అలాగే బాలయ్య యువ దర్శకుడు కొల్లి బాబీతో తన 109వ సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా తదితరులు నటిస్తుండగా నాగవంశీ, త్రివిక్రమ్ లు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లోనే రిలీజ్ చేస్తారని ఊర్వశి రివీల్ చేసింది. కాగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది సంక్రాంతిలో రిలీజ్ చేస్తామని బాలయ్య తాజాగా రివీల్ చేశారు. దీనిపై క్లారిటీ కోసం అభిమానులు ఇప్పుడు ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Read more about: sukumar balakrishna allu arjun
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X