రష్మిక బ్రేకప్ పై ఇంకా తగ్గని ప్రశ్నలు.. విజయ్ దేవరకొండ ఇచ్చిన జవాబుకు రిపోర్టర్ మైండ్ బ్లాక్
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న అదృష్టం ఇప్పుడు మామూలుగా లేదు. వరుసగా బాక్సాఫీస్ వద్ద హిట్స్ అందుకోవాడమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద సినిమాల్లో కూడా ఛాన్స్ అందుకుంటోంది. గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో పాటు భీష్మ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకున్నాయి. అప్పటి నుంచి ఆమెకు పాన్ ఇండియా సినిమాల్లో అవకశాలు వస్తున్నాయి. అయితే నిరంతరం ఆమె ఎక్కువగా కొన్ని చేదు అనుభవాలపై ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఒకనొక సమయంలో విజయ్ ఆ కామెంట్స్ పై చాలా సీరియస్ అయ్యారు.

మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ
రష్మిక మందన్న స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి చాలానే కష్టపడింది. చిన్నా పెద్దా తేడా లేకుండా మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు కొనసాగింది. కొన్ని సినిమాలకు ఆమె రెమ్యునరేషన్ తక్కువ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సొంత టాలెంట్ ను నమ్ముకొని ముందుకు సాగుతోంది.

పాత గాయాలకు సంబంధించిన ప్రశ్నలు
అయితే తరచు ఆమె మీడియా సమావేశాల్లో సోషల్ మీడియాలలో ఒక ప్రశ్నను పదే పదే ఎదుర్కొంటోంది. కన్నడ హీరో రక్షిత్ శెట్టితో కొన్నాళ్ళు డేటింగ్ చేసి పెళ్లి చేసుకోవాలన్న రష్మిక ఎంగేజ్మెంట్ అనంతరం బ్రేకప్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయం గురించి మర్చిపోయి తన కెరీర్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టిన రష్మికకు పలు సందర్భాల్లో మీడియా నుంచి పాత గాయాలకు సంబంధించిన ప్రశ్నలు ఎన్నో ఎదురవుతున్నాయి.

విజయ్ ఇచ్చిన సమాధానంతో
ఇక ఇటీవల ఆమె సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కూడా బ్రేకప్ కు సంబంధించిన కామెంట్స్ చాలానే వస్తున్నాయి. ఈ విషయంపై ఒకసారి విజయ్ దేవరకొండ ఇచ్చిన స్టేట్మెంట్ ను కొందరు అభిమానులు కౌంటర్ గా ఉపయోగిస్తున్నారు. డియర్ కామ్రేడ్ రిలీజ్ సమయంలో అలా రిపోర్టర్ కూడా ఈ విషయం గురించి అడగడంతో విజయ్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఆన్సర్ ఇచ్చాడు.

ఆ ప్రశ్నకు కౌంటర్
మీ ప్రశ్న ఏంటో కూడా నాకు తెలియదు. అర్థం కూడా కాలేదు. ఆ విషయం పక్క వారికి సంబంధం లేనిది. ఒకరి పర్సనల్ విషయాల గురించి ఎవరికి ప్రశ్నించే హక్కు లేదని విజయ్ దేవరకొండ చెప్పగా రష్మీక కూడా దాదాపు అదే తరహాలో రిపోర్టర్ కు కౌంటర్ ఇచ్చేలా సింగిల్ లైన్ తో ఎండ్ కార్డు పెట్టేసింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఆ విషయాలను రష్మిక ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు.


Click it and Unblock the Notifications











