Akhil Akkineni: అఖిల్‌తో మ్యారేజ్ క్యాన్సిల్ .. శ్రీయ భూపాల్ ఎక్కడ? ఆమె భర్త ఎవరంటే?

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున - అమల దంపతుల కుమారుడు అఖిల్ వివాహం జైనాబ్ రవ్జీతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. జూన్ 6వ తేదీన హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. అనంతరం జూన్ 8వ తేదీన అన్నపూర్ణ స్టూడియోలో అఖిల్- జైనాబ్‌ల వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, వ్యాపార తదితర రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరై వథూవరులను ఆశీర్వదించారు.

అఖిల్ పెళ్లిపై మీడియా ఫోకస్
అఖిల్ - జైనాబ్‌ల పెళ్లి, రిసెప్షన్, ఈ ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మహేశ్ బాబు గురించి గడిచిన వారం మొత్తం వార్తలు పోటెత్తాయి. ఇదే సమయంలో అఖిల్ మాజీ ప్రియురాలు శ్రీయా భూపాల్ గురించి కూడా నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. శ్రీయ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఆమె భర్త ఎవరు? ఏం చేస్తారు అంటూ ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

Where is Shriya Bhupal What she doing after cancelling wedding with Akhil Akkineni

శ్రీయా భూపాల్‌తో అఖిల్ పెళ్లి రద్దు
తెలుగు పారిశ్రామిక దిగ్గజాల్లో ఒకరైన జీవీకే రెడ్డి మనవరాలే శ్రీయా భూపాల్. న్యూయార్క్‌‌లోని ప్రఖ్యాత పార్సన్స్ స్కూల్‌ ఆఫ్ డిజైనింగ్ నుంచి పట్టభద్రురాలయ్యారు. దేశంలోని టాప్ సెలబ్రెటీలకు తన డిజైన్లు అందించారు. వ్యాపారపరంగా నాగార్జున, శ్రీయా భూపాల్ కుటుంబాలకు పరిచయం ఉండటంతో అఖిల్- శ్రీయ భూపాల్ మధ్య స్నేహం ప్రేమగా మారింది. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2016లో అఖిల్- శ్రీయాల ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది. 2017లో పెళ్లి చేయాలని నిర్ణయించి ఏర్పాట్లు చేస్తున్న దశలో అఖిల్ - శ్రీయా భూపాల్‌ల ఎంగేజ్‌మెంట్ అనూహ్య కారణాలతో రద్దయ్యింది. దీనిపై ఇరుకుటుంబాలు మౌనం దాల్చగా.. అసలు కారణం ఏంటనేది తెలియరాలేదు.

శ్రీయా భూపాల్ భర్త ఎవరు?
అఖిల్‌తో పెళ్లి రద్దు అయ్యాక కొద్దిరోజులకే శ్రీయా భూపాల్ పెళ్లి చేసుకున్నారు. తెలంగాణలో బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడు అనిందిత్ రెడ్డిని ఆమె పెళ్లాడారు. ఈ దంపతులకు ఓ కుమారుడు. అనిందిత్ రెడ్డి రేసర్‌గా బాగా ఫేమస్. 2016లో యూరో జేకే 16 ఛాంపియన్ షిప్, యూరో జేకే 2017 ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొని సత్తా చాటాడు. 2018 జూలైలో జరిగిన శ్రీయా భూపాల్ - అనిందిత్ రెడ్డి వివాహానికి టాలీవుడ్ సెలబ్రెటీలంతా హాజరయ్యారు. అనిందిత్ .. హీరో రామ్ చరణ్ భార్య ఉపాసనకు స్వయానా కజిన్. బిజినెస్ ఫ్యామిలీ అయినా సెలబ్రెటీలు, రాజకీయ నాయకులతో పరిచయం ఉన్నా శ్రీయా భూపాల్ మీడియాకు దూరంగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటారు.

జైనాబ్‌తో ప్రేమలో పడ్డ అఖిల్
శ్రీయా భూపాల్‌తో పెళ్లి క్యాన్సిల్ అయ్యాక తన కెరీర్, సినిమాలపై ఫోకస్ పెట్టారు అఖిల్ అక్కినేని. కానీ నేటికీ సరైన హిట్ అందుకోలేక తంటాలు పడుతున్నాడు. నాగార్జున స్నేహితుడైన వ్యాపారవేత్త జుల్ఫీ రవ్జీ కుమార్తె జైనాబ్‌తో ప్రేమలో పడిన అఖిల్ ఆమెను పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో అఖిల్ కంటే శ్రీయ 4 సంవత్సరాలు పెద్ద కాగా.. జైనాబ్ కూడా అఖిల్ కంటే 9 ఏళ్లు పెద్ద అనే వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X