Don't Miss!
- Sports హార్దిక్‌పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- News బీజేపీకి అనపర్తి సీటు కేటాయింపు వెనుక వైసీపీ..!?
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Finance Rain Tax: ఆ నగరంలో ప్రజలపై వర్షం టాక్స్..! ఏప్రిల్ నుంచి దబిడిదిబిడేనా..??
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
- Automobiles బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
లక్ష్మీరాయ్ ‘వేర్ ఈజ్ ది వెంకట లక్ష్మి’ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది!
మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెం.150'లో రత్తాలు రత్తాలు అంటూ తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన లక్ష్మీరాయ్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ టాలీవుడ్ అభిమానులను అలరించడానికి వస్తోంది. 'వేర్ ఈజ్ ది వెంకట లక్ష్మి' సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది.
ఎబిటి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 లో తెరకెక్కుతున్న చిత్రం 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి'. లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ కార్తిక్ హీరోగా నటిస్తున్నాడు. పూజిత పొన్నాడ మరో హీరోయిన్ గా నటిస్తోంది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. చిత్ర బృందాన్ని విష్ చేస్తూ మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. ఔట్ కామెడీ చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు.
Best wishes to director @creatorkrish, ABT Creations, #Praveen,#Madhunandan, @iamlakshmirai and the entire team of #WhereIsTheVenkatalakshmi. Here is the first look.goodluck👍👍 pic.twitter.com/djfxlrI71Y
— nithiin (@actor_nithiin) November 4, 2018
ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. రెండు మొహాలు కనిపిస్తున్నట్లు పోస్టర్ డిజైన్ చేశారు. కామెడీ సినిమా అని చెప్పి హారర్ మూవీలా పోస్టర్ ఉండటంతో కథ ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందిరిలోనూ నెలకొంది.
వేర్ ఈజ్ వెంకటలక్ష్మి చిత్రాన్ని ఎం శ్రీధర్ రెడ్డి, హెచ్ ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి ఏబిటి క్రియేషన్స్ సంస్థపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు: కిషోర్ కుమార్, నిర్మాతలు: ఎం శ్రీధర్ రెడ్డి, హెచ్ ఆనంద్ రెడ్డి, ఆర్కె రెడ్డి, బ్యానర్: ఏబిటి క్రియేషన్స్, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్: సాయి దీపక్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు: తాటవర్తి కిరణ్, మ్యూజిక్: హరి గౌర, సినిమాటోగ్రఫి: దినేష్ రవీంద్రనాథ్, ఆర్ట్ డైరెక్టర్: హరి వర్మ.