twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లక్ష్మీరాయ్ ‘వేర్ ఈజ్ ది వెంకట లక్ష్మి’ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది!

    |

    మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెం.150'లో ర‌త్తాలు ర‌త్తాలు అంటూ తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగించిన ల‌క్ష్మీరాయ్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ టాలీవుడ్ అభిమానులను అలరించడానికి వస్తోంది. 'వేర్‌ ఈజ్ ది వెంకట లక్ష్మి' సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది.

    ఎబిటి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 లో తెర‌కెక్కుతున్న చిత్రం 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి'. లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ కార్తిక్ హీరోగా న‌టిస్తున్నాడు. పూజిత పొన్నాడ మ‌రో హీరోయిన్ గా న‌టిస్తోంది.

    Where Is The Venkata Lakshmi first look

    తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. చిత్ర బృందాన్ని విష్ చేస్తూ మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. ఔట్ కామెడీ చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు.

    ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. రెండు మొహాలు కనిపిస్తున్నట్లు పోస్టర్ డిజైన్ చేశారు. కామెడీ సినిమా అని చెప్పి హారర్ మూవీలా పోస్టర్ ఉండటంతో కథ ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందిరిలోనూ నెలకొంది.

    వేర్ ఈజ్ వెంక‌ట‌ల‌క్ష్మి చిత్రాన్ని ఎం శ్రీ‌ధ‌ర్ రెడ్డి, హెచ్ ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి ఏబిటి క్రియేష‌న్స్ సంస్థ‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు: కిషోర్ కుమార్, నిర్మాత‌లు: ఎం శ్రీ‌ధ‌ర్ రెడ్డి, హెచ్ ఆనంద్ రెడ్డి, ఆర్కె రెడ్డి, బ్యాన‌ర్: ఏబిటి క్రియేష‌న్స్, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూస‌ర్: సాయి దీపక్, క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు: తాట‌వ‌ర్తి కిర‌ణ్, మ్యూజిక్: హ‌రి గౌర‌, సినిమాటోగ్ర‌ఫి: దినేష్ ర‌వీంద్ర‌నాథ్, ఆర్ట్ డైరెక్ట‌ర్: హ‌రి వ‌ర్మ‌.

    English summary
    Raai Lakshmi is making her Tollywood comeback with a full-fledged role in a comedy entertainer "Where Is The Venkata Lakshmi". Tollywood hero Nithiin took to Twitter and unveiled the first look poster for Where Is The Venkata Lakshmi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X