'పుష్ప 2'కి భారీ ఓపెనింగ్స్ .. ఈ రెండిట్లో ఎవరి మాట నమ్మాలి..?
ఇప్పుడు ఎన్నో అంచనాలతో పాన్ ఇండియాను షేక్ చేసే లెవెల్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రమే "పుష్ప పార్ట్ 2 ది రూల్". ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సెన్సేషనల్ సీక్వెల్ కోసం అభిమానులు, పాన్ ఇండియా ఆడియెన్స్ గట్టిగానే ఎదురు చూస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో పుష్ప పార్ట్ 2 క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కూడా అంతా ఇంతా కాదు అని అందరికీ తెలిసిందే.
ఇలా సెన్సేషనల్ హైప్ తో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో వచ్చింది. ఇదంతా బాగానే ఉంది కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పుష్ప 2 పరిస్థితి మరోలా ఉందని చెప్పాలి. ఇపుడు అల్లు అర్జున్‌కి హిందీ, కన్నడ, మలయాళంలో క్రేజ్ ఉండొచ్చు కానీ తాను వచ్చింది మాత్రం తెలుగు సినిమా నుంచే.. మెగా బ్రాండింగ్ నుంచే. కానీ మెగా అనే బ్రాండ్ నుంచి తాను బయటకి వచ్చే ప్రయత్నంలో చేసిన పలు మిస్టేక్స్ మాత్రం మెగా అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో బాగా చిచ్చు పెట్టాయని అందరికీ తెలుసు.

దీనితో ఇది సహా పలు కారణాలు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 కి రావాల్సిన భారీ ఓపెనింగ్స్ పై చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ముందు రోజు రాత్రి నుంచే పెయిడ్ ప్రీమియర్స్ ని పెట్టేసారు. ఇది కూడా భారీ టికెట్ ధరలు పెట్టడంతో చాలా ఎఫెక్ట్ పడింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంకో పక్క మాత్రం పుష్ప 2కి రికార్డు బ్రేకింగ్ వసూళ్లు రాబోతున్నాయి అంటూ రెండు వెర్షన్ లు వస్తున్నాయి.
అయితే ఈ రెండు వెర్షన్‌లలో ఏది నిజం అనేది సస్పెన్స్ గా మారింది. సోషల్ మీడియాలో అయితే మన తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2కి చాలా చోట్ల బెనిఫిట్ షోస్ సగం ధరకే టికెట్స్ పెడుతున్నా తెగడం లేదనే టాక్ వైరల్ గా మారింది. ఇలాంటి పరిస్ధితి చాలా చోట్ల నెలకొందని టాలీవుడ్ టాక్. అలాగే భారీగా పెంచేసిన ధరలు కూడా అనుకున్న రేంజ్‌లో బుకింగ్స్‌ని అందుకోలేకపోయాయ్ అని కామెంట్స్ ఉన్నాయి.
కానీ మేకర్స్ నుంచి మాత్రం పుష్ప 2 బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అని, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో పుష్ప 2 కి తెలుగు రాష్ట్రాల్లో రికార్డు ఓపెనింగ్స్ ఖాయం అని ధీమాగా చెబుతున్నారు. కాగా నైజాంలో పరిస్థితి ఓకే కానీ.. ఏపీలో మాత్రం పుష్ప ఈరోజు రాత్రికి కూడా చాలా చోట్ల షోస్ ఫిల్ కావట్లేదు అని పలు బుకింగ్స్ యాప్స్‌కి సంబంధించిన స్క్రీన్ షాట్లు వైరల్ అవుతున్నాయి.

పుష్ప 2 కి భారీగా టికెట్ రేట్లు పెంచడం మూలాన ఈ ఎఫెక్ట్ పడిందని పలువురు వాదిస్తున్నారు. కానీ ఇలాంటి ఓ పెద్ద సినిమాకి అది కూడా ముందు రోజే ప్రీమియర్ షోకి ఈ రేంజ్‌లో టికెట్ ధరలు పెట్టాలి అనుకోవడంలో మేకర్స్ తప్పు కూడా లేదు. ఓ పక్క యాంటీ ఫ్యాన్స్ చెబుతున్నట్టుగా బుకింగ్స్ మరీ అంత సూపర్ లేవు అన్న మాటలో కొంచెమే వాస్తవం ఉంది.
అన్ని స్క్రీన్స్ లో హౌస్ ఫుల్స్ అవ్వట్లేదు అని అంటున్నారు కానీ ఈ రేంజ్ భారీ ధరలతో కూడా పుష్ప 2 దాదాపు 90 శాతం మేర బుకింగ్స్ కనిపిస్తున్నాయి. దీంతో ప్రీమియర్స్‌తో రికార్డు ఓపెనింగ్స్ ఈ చిత్రానికి వస్తాయి అని ట్రేడ్ లో టాక్ ఉంది. సో ఇలా రెండు వెర్షన్‌లలో కూడా ఎవరిది నమ్మాలి? ఎవరిది నమ్మకూడదు అనేది ఆడియెన్స్ కి అర్ధం కావట్లేదు. కానీ పుష్ప 2 తో అల్లు అర్జున్ మాసివ్ ఓపెనింగ్స్ కొట్టబోతున్నాడు అనేది వాస్తవం.


Click it and Unblock the Notifications











