Raid: మంగ్లీ పార్టీలో సెలబ్రిటీలు ఎవరెవరు ఉన్నారంటే? అధికారులకు సింగర్ బెదిరింపులా?

హైదరాబాద్ నగర శివారులోని చేవెళ్లలోని ఓ రిసార్టులో సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీని నార్కోటిక్ అధికారులు, స్థానిక పోలీసులు భగ్నం చేశారు. నిషేధిత మాదక ద్రవ్యాలు పార్టీలో ఉపయోగిస్తున్నారనే ముందస్తు సమాచారంతో పక్కాగా రిసార్డుపై మెరుపుదాడి చేశారు. ఈ సందర్భంగా అధికారులతో విందుకు హాజరైన అతిథులు, మంగ్లీ వాదనకు దిగిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా సోదాలు నిర్వహిస్తున్న అధికారులపై మంగ్లీ బెదిరిస్తూ ఉండటం కనిపించింది. ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.

చేవెళ్లలోని త్రిపుర రిసార్టులో మంగ్లీ తన బర్త్ డే పార్టీని ఏర్పాటు చేశారు. ఈ జన్మదిన వేడుకలకు 50 మంది హాజరయ్యారు. ఎలాంటి అనుమతి లేకుండా పార్టీని నిర్వహించడం, అందులో ఫారిన్ ఆల్కహల్, గంజాయి లాంటి మత్తు పదార్థాలను సరఫరా చేయడంతో పోలీసులు సీరియస్‌గా తీసుకొన్నారు. ఈ నేపథ్యంలో ఈ పార్టీ నిర్వహించిన మంగ్లీపై ఎక్సైజ్, నార్కో అధికారులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా విదేశీ మద్యాన్ని పార్టీలో ఏర్పాటు చేయడం చట్ట రీత్యా వ్యతిరేకం కావడంతో రిసార్ట్ ఓనర్, జనరల్ మేనేజర్‌పై కూడా కేసు నమోదు చేశారు.

Mangli Birthday Party

చేవెళ్లలో మంగ్లీ నిర్వహించిన పార్టీలో దివి వద్యా, సినీ రచయిత కాసర్ల శ్యామ్, సింగర్ ధనుంజయ్, నిర్మాత, దర్శకుడు దామోదర్‌తోపాటు పలువురు వర్థమాన తారలు కూడా ఉన్నారు అని తెలిసింది. ఈ పార్టీలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. అందులో 9 మందికి పాజిటివ్ అని తేలింది. నిర్మాత దామోదర్‌కు పాజిటివ్ అని తేలడతో ఆయనతోపాటు మరికొందరిపై కూడా కేసు నమోదు చేసినట్టు సమాచారం.

అయితే పోలీసులు తనిఖీలు చేస్తూ వీడియో తీస్తుండగా సింగర్ మంగ్లీ, ఆమె అనుచరులు అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. వీడియో తీయడం ఆపండి అంటూ మంగ్లీ అధికారులను బెదిరించడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. అయితే ఆమె బెదిరింపులకు జవాబిస్తూ మా డ్యూటీ మమ్నల్ని చేసుకోనివ్వండి. నా డ్యూటికి అడ్డం తగలకండి. నా డ్యూటీని ఎలా ఆపుతారు అంటూ పోలీసులు ముందుకెళ్లారు. దాంతో ఆమె అక్కడి నుంచి తప్పుకొన్నారు.

అయితే ఈ పార్టీలో పాల్గొన్న సినీ గేయరచయిత కాసర్ల శ్యామ్ తనపై వస్తున్న అవాస్తవ కథనాలపై స్పందించారు. మంగ్లీ నిర్వహించిన బర్త్ డే పార్టీకి హాజరయ్యాను. ఆ పార్టీలో కేక్ కట్ చేసినంత వరకు ఉన్నాను. ఆ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నాను. సెలబ్రేషన్స్ ముగిసిన తర్వాత అక్కడి నుంచి వచ్చాను. డ్రగ్స్ విషయం గురించి నాకు తెలియదు. అలాంటి వాటికి నేను దూరం. నాకు డ్రగ్స్ అలవాటు లేదు. అనవసరంగా నాపై తప్పుడు ప్రచారం చేయవద్దు అని కాసర్ల శ్యామ్ మీడియాకు విన్నవించుకొన్నారు.

అయితే చాలా రోజుల తర్వాత సెలబ్రిటీ పార్టీని నార్కోటిక్ అధికారులు భగ్నం చేసిన వార్త తెలుగు సినిమా రంగంలో కలకలం రేపింది. ఈ పార్టీలో సెలబ్రిటీలు ఎవరెవరు ఉన్నారు? అని ఆరా తీశారు. అయితే ఎక్కువ మంది సినీ తారలు ఈ పార్టీకి హాజరకాకపోవడం గమనార్హం. మంగ్లీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎక్కువ మంది హాజరయ్యారని తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X