రామ్ చరణ్ - ఉపాసనలకు ట్విన్స్... కవల పిల్లల్లో పెద్ద ఎవరు? ముందు ఎవరు పుట్టారంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చారు. జనవరి 31వ తేదీ రాత్రి హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఆడబిడ్డ, మగబిడ్డలకు ఉపాసన జన్మనిచ్చారని, ప్రస్తుతం తల్లీ, బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. రామ్ చరణ్‌కు వారసుడు పుట్టడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాతో పాటు వ్యక్తిగతంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే రామ్ చరణ్ - ఉపాసనలకు జన్మించిన కవల పిల్లల్లో ముందుగా ఎవరు పుట్టారు? ఇద్దరిలో పెద్ద ఎవరు? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనికి మెగా, కొణిదెల కుటుంబ సభ్యులు, అపోలో హాస్పిటల్ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. ఈ వివరాల్లోకి వెళితే..

రామ్ చరణ్ - ఉపాసన లవ్‌స్టోరీ
అపోలో హాస్పిటల్ ఛైర్మన్ అపోలో ప్రతాప్ సి రెడ్డి మనవరాలే ఉపాసన కొణిదెల. ఓ స్పోర్ట్స్ క్లబ్ ఈవెంట్‌‌లో తొలిసారిగా రామ్ చరణ్‌‌‌‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కొన్నేళ్లపాటు ప్రేమాయణం సాగించి.. పెద్దల అంగీకారంతో పెళ్లీపీటలెక్కారు. తొలుత 2011 డిసెంబర్ 11న వీరి నిశ్చితార్ధం ఘనంగా జరిగింది. ఆ తర్వాత ఆరు నెలలకు 2012 జూన్ 14న రామ్ చరణ్ - ఉపాసనల పెళ్లి అట్టహాసంగా జరిగింది. ఈ దంపతులకు 2023 జూన్‌లో ఉపాసన - రామ్ చరణ్ దంపతులు క్లీంకారాకు జన్మనిచ్చారు.

Who Is Elder Among Ram Charan- Upasana s Newborn Twins

రెండోసారి గర్భం దాల్చిన ఉపాసన
గతేడాది మెగాస్టార్ నివాసంలో జరిగిన దీపావళి వేడుకలలో ఉపాసన సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఉపాసనను అందరూ దీవిస్తూ ఉండటంతో అప్పుడే ఉపాసన రెండోసారి గర్భం దాల్చారని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపించాయి. ఆ తర్వాత కొద్దిరోజులకే తాము రెండోసారి తల్లిదండ్రులం కాబోతున్నట్లు ఉపాసన, రామ్ చరణ్‌లు అధికారికంగా ప్రకటించారు. అదే సమయంలో ఉపాసనకు ట్విన్స్ ‌జన్మించబోతున్నట్లుగా చెప్పడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

రామ్ చరణ్‌- ఉపాసనలకు ట్విన్స్
తాజాగా జనవరి 31వ తేదీ రాత్రి ఉపాసన దంపతులు పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఆడ, మగ బిడ్డలు జన్మించారని.. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని చిరంజీవి అధికారికంగా ప్రకటించారు. అయితే ఇద్దరు కవలల్లో ముందు ఎవరు పుట్టారు? ఇద్దరిలో ఎవరు పెద్దా? అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఆదివారం అపోలో హాస్పిటల్స్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొణిదెల, కామినేని కుటుంబ సభ్యులు, అపోలో డాక్టర్లు దీనిపై క్లారిటీ ఇచ్చారు.

కవల పిల్లల్లో పెద్ద ఎవరు?
ఆ భగవంతుడి దయవల్ల, హనుమాన్ కృపవల్ల ఒక ఆడబిడ్డ, మగబిడ్డ జన్మించారు. మీ అందరితో ఈ విషయం షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. డాక్టర్ సుమన గారు, గైనకాలజిస్ట్ రమా సిన్హా, పిడియాట్రిక్ నిపుణులు లత, అపోలో సిబ్బందికి చిరు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అపోలో డాక్టర్లు మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉపాసన, ఇద్దరు పిల్లలు ఆరోగ్యంతో ఉన్నారు. పిల్లలిద్దరూ చాలా అందంగా ఉన్నారు.. ముందుగా అబ్బాయి.. ఆ తర్వాత కొద్ది నిమిషాలకు అమ్మాయి పుట్టారు అని వారు తెలిపారు.

More from Filmibeat

Read more about: chiranjeevi ram charan upasana
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X