ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఎవరికి? రోజుకు 18 కోట్ల పారితోషికం తీసుకొనే హీరో ఎవరో తెలుసా?
ఇండస్ట్రీలో సినీ తారల రెమ్యునరేషన్లు ఎప్పటికీ అభిమానులకు ఆసక్తికరమైన అంశంగానే ఉంటాయి. ఫలానా హీరో అత్యధికంగా పారితోషికం తీసుకొంటే.. సంబంధింత యాక్టర్ అభిమానులు గొప్పగా చెప్పుకొంటారు. అధికారికంగా రెమ్యునరేషన్ల వివరాలను మాత్రం బయటకు ప్రకటించకపోయినా.. ఏదో రూపంలో స్టార్ హీరోలు, హీరోయిన్ల పారితోషికం వార్తలు మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉంటాయి. ఇలాంటి విషయాలు ఫ్యాన్స్ మధ్య భారీ చర్చు దారి తీస్తాయి. అయితే ఇండియాలో అత్యధికంగా పారితోషికం తీసుకొనే హీరో ఎవరనే విషయం ఎప్పటికీ క్రేజీ న్యూస్‌గానే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకొనే హీరో గురించి తమిళ నటుడు యుగి సేతు వెల్లడించిన వివరాల్లోకి వెళితే..
దక్షిణాదిలోనే కాకుండా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటికీ రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, విజయ్, అజిత్ లాంటి హీరోలే అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకొనే హీరోల జాబితాల తమ సత్తాను చాటుతున్నారు. అయితే సీనియర్ సిటిజన్స్ జాబితాలో చేరిన ఈ అగ్ర నటులు మాత్రం పారితోషికం విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదనేది ఇండస్ట్రీ సమాచారం. వారు సాధించే హిట్స్, రాబట్టే కలెక్షన్లే భారీ పారితోషికానికి డిమాండ్‌గా మారిందనే విషయంలో ఎలాంటి అనుమానం లేదని సినీ వర్గాలు అంటున్నాయి.

ఇండియాలో షారుక్ ఖాన్, రజనీకాంత్, చిరంజీవి, కమల్ హాసన్, విజయ్ అజిత్‌లో ఎవరు అధికంగా పారితోషికం తీసుకొంటారనే విషయంపై చర్చ జరుగుతున్న సమయంలో తమిళ నటుడు, రచయిత యుగి సేతు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఇండియాలో అత్యధికంగా పారితోషికం తీసుకొనే హీరోల్లో కమల్ హాసన్ టాప్. ఆయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి2898AD సినిమాకు హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకొన్నాడు అని వివరాలను వెల్లడించారు.
కమల్ సార్ బర్త్ డే సందర్భంగా ఆయనను కలిసినప్పుడు నాకు నిర్మాత అశ్వినీదత్‌ను పరిచయం చేశాడు. ఆ సందర్భంగా మాట్లాడుతుంటే.. 20 రోజుల కాల్సిట్ కేటాయించినందుకు కమల్ సార్‌కు 150 కోట్ల పారితోషికం ఇచ్చారా? అని అంటే.. కాదు ఆయన మాకు కేటాయించింది కేవలం 10 రోజులే.. అందుకు 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొన్నాడు అని నిర్మాత చెప్పారు. అంటే ప్రతీ రోజు 2 మిలియన్ డాలర్ల పారితోషికాన్ని కమల్ సార్ తీసుకొన్నారు అని ఆయన చెప్పారు.
కల్కి 2 సినిమా షూటింగ్‌లో ప్రస్తుతం కమల్ హాసన్ బిజీగా ఉన్నారు. గత కొద్దికాలంగా ఆయన అమితాబ్, ప్రభాస్‌తో కలిసి కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. పార్ట్ 2 సినిమా కోసం కూడా ఆయనకు భారీగా రెమ్యునరేషన్ ముట్ట జెబుతున్నారనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.
కమల్ హాసన్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల ఆయన థగ్ లైఫ్ సినిమాలో నటించారు. ప్రస్తుతం సెయాన్, తలైవర్ 173, తన కెరీర్‌లో 237వ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారు. నిర్మాతగా ఆయన నిర్మించిన అమరన్ చిత్రం రికార్డు కలెక్షన్లను రాబట్టింది. యాక్టర్‌గానే కాకుండా నిర్మాతగా కూడా 70 ఏళ్ల వయసులో కుర్ర హీరోలను పక్కన పెట్టే విధంగా తన టాలెంట్‌ను చాటుతూ అధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు.


Click it and Unblock the Notifications











