Who is Iman Esmail? ప్రభాస్ సరసన జూనియర్ అనుష్క.. ఎవరీ ఇమాన్ ఇస్మాయిల్?

సలార్, కల్కి 2898 ఏడీ వరుస విజయాలతో జోరు మీదున్నారు ప్రభాస్. ఈ జోష్‌ను ఇలాగే కంటిన్యూ చేస్తూ రాజా సాబ్‌లో నటిస్తున్న ఆయన .. సలార్ 2, కల్కి 2లను కూడా వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్‌ను కూడా సెట్స్‌ పైకి తీసుకురావాలన్నది ప్రభాస్ స్కెచ్. తాజాగా సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో డార్లింగ్ నటిస్తోన్న మూవీ శనివారం లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది.

భారత స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో 1940ల నాటి పీరియాడికల్ , యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసి.. అందులో స్టోరీ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేసింది. ఓ కోటలో ఫిరంగుల గర్జనలు, సైనికులు పోరాడుతున్న వేళ.. కోటపై బ్రిటీష్ జాతీయ పతాకం కాలిపోతున్నట్లుగా పోస్టర్ చూపించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీలో ప్రభాస్ సరసన సోషల్ మీడియా సెన్షేషన్ ఇమాన్వీ ఎస్మాయిల్ నటిస్తున్నారు. దీంతో ఆమె ఎవరు, నేపథ్యం ఏంటీ అంటూ నెట్టింటిలో చర్చించుకుంటున్నారు.

Who is Iman Esmail She starring opposite Prabhas- Hanu Raghavapudi s Project here s the details

పాకిస్తాన్ మూలాలున్న ఇమాన్వీ ఎస్మాయిల్‌ ఫ్యామిలీ ఢిల్లీలో సెటిలైంది. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం. అందుకే కుటుంబ సభ్యులు ఆమెను ఆ దిశగా ఎంతో ప్రోత్సహించారు. బాలీవుడ్ తారలు రేఖ, మాధురీ దీక్షిత్, వైజయంతీ మాల వంటి వారు వేసే డ్యాన్స్ మూవ్‌మెంట్స్‌ను పరిశీలించేలా వాళ్ల అమ్మగారు కొన్ని సూచనలు చేశారట. అందుకే ఈ అమ్మడు చేసే డ్యాన్స్‌తో పాటు ఎక్స్‌ప్రెషన్స్ కూడా పర్ఫెక్ట్‌గా సింకవుతాయి. ముఖ్యంగా ఇమాన్వీకి తండ్రి అండగా నిలవడంతో.. ఉద్యోగానికి రాజీనామా చేసి, యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు.

ఆ తర్వాత ఫుల్‌టైమ్ డ్యాన్స్, ఈవెంట్స్, డ్యాన్స్ షోలపై ఫోకస్ పెట్టి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. హిందీ తన మాతృభాష అయినా మిగిలిన భారతీయ భాషల్లో వచ్చే కొత్త సినిమా పాటలను వినడం ఇమాన్వీకి అలవాటు. ఆ పాటలకు తానే కొత్త స్టెప్స్‌ని క్రియేట్ చేసి రీల్స్‌గా వదుల్తుంది ఇమాన్వీ. అంతేకాదు.. రీల్ చేసేటప్పుడు ట్రెండ్ అయ్యే పాటలు ఏవి, దీనికి ఎలాంటి దుస్తులు వేసుకోవాలి అనే విషయంలోనూ ఎంతో కేర్ తీసుకుంటుంది కాబట్టే ఆమె ఇంత పాపులర్ అయ్యింది. కొందరు ఈమెను జూనియర్ అనుష్క అంటూ అప్పుడే మోసేస్తున్నారు కూడా.

డ్యాన్స్ నేర్చుకుంటూనే ఎంబీఏ సైతం పూర్తి చేసింది ఇమాన్వీ. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు దాదాపు 7 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా.. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ సరసన ఛాన్స్ దక్కించుకోవడంతో మిలియన్ ఫాలోవర్స్ మార్క్‌ను చేరుకోవడం పెద్ద కష్టం కాదు. మొదటి సినిమాతోనే , అది కూడా ఏకంగా ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ పక్కన నటించే అవకాశం దక్కడమంటే మామూలు విషయం కాదు. ఇమాన్వీ అదృష్టం చూసి స్టార్ హీరోయిన్లు సైతం కుళ్లుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రభాస్ మూవీ అనౌన్స్‌మెంట్ తర్వాతి నుంచి ఇమాన్వీ పాత వీడియోలు ఆన్‌లైన్‌లో మరోసారి ట్రెండింగ్‌లోకి వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X