Who is Rishabh Sawhney? నాగబంధం విలన్ రిషబ్ సాహ్నీ ఎవరో తెలుసా? క్రూరమైన ప్రతినాయకుడిగా బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

తెలుగు సినిమా రంగంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్, ఎన్ఐకే స్టూడియోస్ బ్యానర్‌పై యువ హీరో, హీరోయిన్లు విక్రాంత్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్, దక్షా నగార్కర్ నటించిన చిత్రం నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు రిషబ్ సాహ్నీ, దర్శకుడు మహేష్ మంజ్రేకర్, జగపతి బాబు, మురళీ శర్మ, రామచంద్రరాజు, అనసూయ భరద్వాజ్, శరణ్య తదితరులు నటించారు. ఈ చిత్రానికి నిర్మాత అభిషేక్ నామా తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి కథ, స్క్రీన్ ప్లేను అందించారు. ఈ సినిమాకు కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. అయితే ఈ చిత్రంలో కరుడుగట్టిన విలన్‌గా, పాకిస్థానీ టెర్రరిస్గుగా కనిపించిన రిషబ్ సాహ్నీ (Rishabh Sawhney) ఎవరు? అతడి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అనే విషయం చర్చనీయాంశమైంది. ఇంతకు రిషబ్ సాహ్నీ ఎవరు? అనే వివరాల్లోకి వెళితే..

ఇతిహాసాలు, పురాణాల్లోని అంశాలను ఆధారంగా చేసుకొని గ్రాండియర్ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్ వర్క్‌తో నాగబంధం సినిమాను భారీ బడ్జెట్ చిత్రంగా మలిచారు. దాదాపు 100 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రంలో అత్యంత కీలకంగా మారిన అఫ్గన్ సుల్తాన్ అబ్దాలీ అనే పాత్రను దర్శకుడు అభిషేక్ నామా బలంగా చూపించారు. క్రూరమైన ప్రతి నాయకుడి పాత్రతో రిషబ్ సాహ్నీని తెరమీద ఆవిష్కరించారు.

Who is Rishabh Sawhney

అయితే రిషబ్ సాహ్నీ విషయానికి వస్తే.. ముంబైలో మోడల్‌గా కెరీర్ ప్రారంభించారు. నటుడిగా మారక ముందు కొన్ని సిరీస్‌లకు కాస్టింగ్ అసిస్టెంట్ పనిచేశారు. కాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా కౌన్ బనేగి శిఖర్‌వాతీ, బెస్ట్ సెల్లర్ సిరీస్‌లలో చిన్న పాత్రలతో నటుడిగా ప్రవేశం చేశారు. 2021 సంవత్సరంలో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు.

ఆ తర్వాత హృతిక్ రోషన్ హీరోగా సిద్దార్త్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఫైటర్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో గుర్తింపు పొందారు. అంతకు ముందు 2021 సంవత్సరంలో ది ఎంపైర్ అనే వెబ్ సిరీస్‌లో నటించి తన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోవడంతో ఫైటర్ సినిమా అవకాశం లభించింది అని ఆయన అన్నారు. ఆ తర్వాత ఇందిరా ధార్ దర్శకత్వంలో దివ్య దత్తా, నీరజ్ కాబీతో కలిసి ఎకోస్ఆఫ్ వాలర్ అనే సిరీస్‌లో నటించారు. ఈ సిరీస్‌ను వెనీస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించడం విశేషంగా చెప్పుకోవాలి.

ఇక ప్రస్తుతం నాగబంధం చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే నటుడిగా మంచి మార్కులు సంపాదించారు. విరాట్ కర్ణతో పోటాపోటీగా నటించి.. టాలీవుడ్‌కు విలన్ రూపంలో కొత్త నటుడు పరిచయమయయారు అనే టాక్‌ను సంపాదించుకొన్నారు. అబ్దాలీ పాత్రలో రిషబ్ సాహ్నీ చూపించిన పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్, పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్, మ్యాగ్నెటిక్ ఆరా 'నాగబంధం' సినిమా గురించి జరుగుతున్న చర్చల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సోషల్ మీడియా స్పందనను బట్టి చూస్తే, ఈ చిత్రంలో ప్రేక్షకుల మనసులో బలమైన ముద్ర వేసిన పాత్రల్లో 'అబ్దాలీ' ఒకటిగా నిలిచిందనే చెప్పాలి.

Read more about: Nagabandham abhishek nama
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X